Weather Forecast: హై అలర్ట్.. రెండు రోజులు భారీ వర్షాలు.. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో..

|

Apr 06, 2023 | 7:35 AM

తెలంగాణ వాసులకు వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటించింది. రాజధాని హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. బుధవారం నుంచి వాతావరణంలో మార్పులు చోటు చేసుకోగా.. గురువారం, శుక్రవారం ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది.

Weather Forecast: హై అలర్ట్.. రెండు రోజులు భారీ వర్షాలు.. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో..
Weather Alert
Follow us on

తెలంగాణ వాసులకు వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటించింది. రాజధాని హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. బుధవారం నుంచి వాతావరణంలో మార్పులు చోటు చేసుకోగా.. గురువారం, శుక్రవారం ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఇప్పటికే బుధవారం నాడు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. గురువారం, శుక్రవారం నాడు కూడా వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

ఈ రెండు రోజుల్లో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇకక శనివారం కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే చాన్స్ ఉందన్నారు. ఏప్రిల్ 9వ తేదీ నుంచి వాతావరణంలో మార్పులు వస్తాయని, గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లాల్లో రైతులు అలర్ట్‌గా ఉండాలని, పంటల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు వాతావరణ శాఖ అధికారులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..