
తెలంగాణలో పలుచోట్ల అకాలవర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో రాత్రి పలుచోట్ల తేలికపాటి వర్షం కురిసింది. నిర్మల్ జిల్లా న్యూవెల్మల్ గ్రామంలో చెట్లు విరిగిపడ్డాయి. జగిత్యాల జిల్లాలోని పలు మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. భారీ ఈదురుగాలులకు మామిడి, మొక్కజొన్న పంటలు నేరరాలాయి. నైరుతి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్ నుంచి ఉత్తర కోస్తా వరకు ద్రోణి ప్రభావం కనిపిస్తోంది. ఇవాళ, రేపు ఏపీలో పలు ప్రాంతాల్లో తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమరావతి వాతావరణ శాఖ సూచించింది.
అటు తెలంగాణలో పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 2-3 గంటల్లో గద్వాల్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, వనపర్తి జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులు సంభవించే ఛాన్స్ ఉందని తెలిపింది. కాగా రాత్రంతా హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే.
FIRST INTENSE RAINS OF 2026
During last 24hrs, INTENSE THUNDERSTORMS lashed across Rangareddy, Vikarabad, Siddipet, Mahabubnagar, Nagarkurnool, Nalgonda, Suryapet, Khammam, Bhadradri, Asifabad, Nirmal, Jagitial districts
Highest – Nalgonda, Chandampet – 70mm
Hyderabad too got… pic.twitter.com/0Rhw612DHq
— Telangana Weatherman (@balaji25_t) February 24, 2026