Uma Maheswaram: ఉమమహేశ్వర క్షేత్రంలో పరవళ్లు తొక్కుతున్న జలపాతం.. అందాలు చూడతరమా

భారీ వర్షాలకు కొండపై నుంచి నీరు జాలువారుతోంది. చుట్టూ పచ్చని వాతావరణం నడుమ పర్వతంపై నుంచి కిందికి దూకుతున్న జలపాతాన్ని చూసేందుకు స్థానికులతో పాటు పర్యాటకులు సైతం క్యూ కడుతున్నారు. జలపాతాన్ని చూసి కన్నుల ఆనందంతో పొంగిపోతున్నారు భక్తులు. జలపాతం ప్రాంతానికి ఎవరు వెళ్లవద్దని సూచించారు ఆలయ అధికారు. జలపాతానికి దూరంగా ఉండాలని, ఎందుకంటే,

Uma Maheswaram: ఉమమహేశ్వర క్షేత్రంలో పరవళ్లు తొక్కుతున్న జలపాతం.. అందాలు చూడతరమా
Uma Maheswaram

Updated on: Aug 20, 2024 | 4:33 PM

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నాగర్​కర్నూల్​ జిల్లా అచ్చంపేట మండలం నల్లమల ప్రాంతమైన రంగాపురంలోని శ్రీ ఉమామహేశ్వర క్షేత్రంలో జలపాతం అందాలు కనువిందు చేస్తున్నాయి. దేవస్థానం పాపనాశనం వద్ద జాలువారుతున్న జలపాతం దృశ్యాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. భారీ వర్షాలకు కొండపై నుంచి నీరు జాలువారుతోంది. చుట్టూ పచ్చని వాతావరణం నడుమ పర్వతంపై నుంచి కిందికి దూకుతున్న జలపాతాన్ని చూసేందుకు స్థానికులతో పాటు పర్యాటకులు సైతం క్యూ కడుతున్నారు. జలపాతాన్ని చూసి కన్నుల ఆనందంతో పొంగిపోతున్నారు భక్తులు. జలపాతం ప్రాంతానికి ఎవరు వెళ్లవద్దని సూచించారు ఆలయ అధికారు. జలపాతానికి దూరంగా ఉండాలని, ఎందుకంటే, కొండలపై నుంచి రాళ్ళు జారిపడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఈ వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..