Drunken Constable: వరంగల్ పట్టణంలో ఓ హెడ్ కానిస్టేబుల్ తుపాకీతో హల్‌చల్ చేశాడు. పీకల్లోతు తాగి చేతిలో తుపాకీ పట్టుకున రోడ్డుపై వెళ్తున్న పాదాచారులను భయబ్రాంతులకు గురి చేశాడు. ఈ ఘటన నిన్న రాత్రి చోటు చేసుకోగా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఫుల్లుగా మద్యం సేవించిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ బాలప్రసాద్ పట్టణంలోని గోపాలస్వామి గుడి వద్ద ప్రధాన రహదారిపై వీరంగం సృష్టించాడు. కానిస్టేబుల్ తుపాకీని చేతపట్టుకుని స్థానికులను బెదిరించడంతో వారు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న మట్వాడ పోలీసులు.. హెడ్ కానిస్టేబుల్ బాలప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని, అతని వద్ద ఉన్న గన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ బాలప్రసాద్.. ఎంజీఎంలో ఖైదీలకు సెక్యూరిటీ నిమిత్తం వచ్చినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
Also read:
మంత్రి కొడాలి నాని సొంత ఊరిలో వైసీపీ ఓటమి అంటూ ప్రచారం.. అసలు విషయం ఆ సర్పంచ్ తేల్చేశారు
ఎస్ఈసీ ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించిన మంత్రి.. విచారణను వాయిదా వేసిన ఏపీ హైకోర్టు..