Warangal: బహిరంగసభలు, సమావేశాలపై నిషేధం.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన వరంగల్ పోలీస్ కమిషనర్

|

Aug 26, 2022 | 4:03 PM

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బహిరంగసభలు, సమావేశాలు, ర్యాలీలపై నిషేధిత ఉత్తర్వులను జారీ చేశారు పోలీస్ కమిషనర్ తరుణ్ జోషీ. ప్రజా భద్రత, ప్రశాంతతను కాపాడాలనే ఉద్దేశ్యంతో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా..

Warangal: బహిరంగసభలు, సమావేశాలపై నిషేధం.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన వరంగల్ పోలీస్ కమిషనర్
Warangal
Follow us on

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) పాదయాత్ర ముగింపు సభ నేపథ్యంలో వరంగల్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బహిరంగసభలు, సమావేశాలు, ర్యాలీలపై నిషేధిత ఉత్తర్వులను జారీ చేశారు పోలీస్ కమిషనర్ తరుణ్ జోషీ. ప్రజా భద్రత, ప్రశాంతతను కాపాడాలనే ఉద్దేశ్యంతో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు.  30 సిటి పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లుగా వెల్లడించారు. ఈ యాక్ట్ ప్రకారం బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలపై నిషేదాన్ని విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన పోలీస్ కమిషనర్ తరుణ్ జోషీ. నేటి నుంచి ఈ నెల 31 ఉదయం 6 గంటల వరకు ఈ నిషేధిత ఉత్తర్వులు అమలులో ఉంటుందన్నారు. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు పోలీస్ కమిషనర్ తరుణ్ జోషీ.. శనివారం బహిరంగ సభ నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది.

బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రపై నిన్న విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి.. పాదయాత్ర ఆపాలని పోలీసులిచ్చిన నోటీసును సస్పెండ్ చేస్తూ.. బండి సంజయ్ పాదయాత్రకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.

ఈ అప్పీల్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని సీజే ధర్మాసనాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. పాదయాత్ర కొనసాగితే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

బండి సంజయ్ పాదయాత్రను నిలిపివేయాలంటూ.. మరో పిటీషన్ దాఖలైంది. దీనిపై బీజేపీ లీడర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాదయాత్రకు ఎన్ని రకాలుగా అడ్డు పడ్డా.. తిరిగి న్యాయమే గెలుస్తుందన్నారు బండి సంజయ్. కోర్టుపై తమకు నమ్మకముందని అన్నారాయన. పాదయాత్రలో ఉన్న బండి సంజయ్ తో పాటు ఇతర బీజేపీ లీడర్లు ఏమంటున్నారో.. మా ప్రతినిథి పెద్దీష్ మరిన్ని వివరాలను అందిస్తారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం