
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరస దొంగతనాలు, చైన్ స్నాచింగ్స్ ప్రజలను హడలెత్తిస్తున్నాయి. నగరంలో నెలరోజుల వ్యవధిలో నాలుగు చైన్ స్నాచింగ్స్ జరగ్గా.. అటు ఇళ్లు, హాస్టల్స్‌లోనూ వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల బొల్లికుంట వద్ద ఉన్న ప్రైవేట్ హాస్టల్స్‌ను టార్గెట్ చేసిన దొంగలు తెల్లవారుజామున వరుస చోరీలకు పాల్పడతూ విద్యార్థులను వనికి పోయేలా చేస్తున్నారు. సోమవారం ఒక్కరోజే మూడు హాస్టల్స్‌లో దూరి విద్యార్థులకు చెందిన 6 మొబైల్స్, 3 ల్యాప్ టాప్స్‌ను ఎత్తుకెళ్లారు.
తెల్లవారుజామున అందరూ గాడ నిద్రంలో ఉన్న సమయంలో హాస్టల్స్‌లోకి చొరబడుతున్న ఈ కేటుగాళ్లు విద్యార్థినల గదిలోని విలువైన వస్తువులన్నీ దోచుకుపోతున్నారు. అయితే తాజాగా జరిగిన ఓ చోరీకి సంబంధిచిన దృశ్యాలు హాస్టల్ సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యాయి. ఉదయం సీసీ ఫుటేజ్ గమనించిన హాస్టల్ వార్డెన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనపై కేసు నమోదు చేసుకొని సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు.
అయితే తరచూ హాస్టల్స్‌లో చోరీలు జరుగుతున్నా పోలీసులు, హాస్టల్ నిర్వాహకులు పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకపైనైనా ఇలాంటి దొంతనాలు జరగకుండా చూడాలని కోరుతున్నారు. అయితే ఈ దొంగతనాల ఘటనపై అటు విద్యార్థినుల తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దొంగలు హాస్టల్స్ దూరేంత వరకు సెక్యూరిటీ ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. తమ పిల్లలకు భద్రత ఏదని మండిపడుతున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.