YSR Death: తెలంగాణకు పాకిన వైఎస్ మరణంపై మాటల యుద్ధం.. మల్లు రవి ఫిర్యాదుపై నారాయణస్వామి ఏమన్నారంటే..?

|

Jan 08, 2024 | 8:39 PM

వైఎస్‌ఆర్టీపీని వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో ఈనెల 4న విలీనం చేశారు. అప్పటినుంచి దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి మరణానికి సంబంధించి ఆరోపణలు, ప్రత్యారోపణలు మొదలయ్యాయి. వైఎస్ మరణం వెనుక కాంగ్రెస్‌, టీడీపీలు ఉన్నాయని ఆరోపించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల కామెంట్లకు కౌంటర్‌ ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు..

YSR Death: తెలంగాణకు పాకిన వైఎస్ మరణంపై మాటల యుద్ధం.. మల్లు రవి ఫిర్యాదుపై నారాయణస్వామి ఏమన్నారంటే..?
YSR Death Politics
Follow us on

వైఎస్‌ఆర్టీపీని వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో ఈనెల 4న విలీనం చేశారు. అప్పటినుంచి దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి మరణానికి సంబంధించి ఆరోపణలు, ప్రత్యారోపణలు మొదలయ్యాయి. వైఎస్ మరణం వెనుక కాంగ్రెస్‌, టీడీపీలు ఉన్నాయని ఆరోపించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల కామెంట్లకు కౌంటర్‌ ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. కాంగ్రెస్‌లో షర్మిల చేరికలో తన ప్రమేయం లేదంటూనే.. గతంలో రిలయన్స్ దాడి, ఆ తర్వాతి పరిణామాలను ప్రస్తావించారు. షర్మిల తమ పార్టీలో చేరడంతో వైసీపీ నేతలు భయపడుతున్నారని కాంగ్రెస్‌ నేతలు ఎదురుదాడికి దిగారు. వైఎస్ ఇంట్లో ఏం జరిగినా తమకు ఆపాదించడం సరికాదంటూ చంద్రబాబు పేర్కొన్నారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి స్పందించారు. వైఎస్ మరణానికి కాంగ్రెస్‌ నేతలతో పాటు చంద్రబాబు కూడా కారణమని బాంబు పేల్చారు. వైఎస్ మరణానికి కాంగ్రెస్‌, టీడీపీలే కారణం అంటూనే పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో కాక రేపుతున్న వైఎస్ డెత్ అండ్ డౌట్స్‌.. ఇప్పుడు తెలంగాణకు పాకాయి. ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ వ్యాఖ్యలపై టీకాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి అభ్యంతరం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ బేగంబజార్ పీఎస్‌లో నారాయణస్వామిపై ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా నారాయణ తన వ్యాఖ్యల్ని విత్ డ్రా చేసుకోవాలని.. లేదంటే ప్రజా ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. అయితే, మల్లు రవి ఫిర్యాదు చేసిన కాసేపటికే మళ్లీ నారాయణస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి రేవంత్‌రెడ్డి, చంద్రబాబు, షర్మిలను కలిపి మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి, చంద్రబాబు కుట్రలో భాగంగానే ఫిర్యాదులు చేస్తున్నారంటూ పేర్కొన్నారు.

వైఎస్ మరణంపై గతంలోనూ అనుమానాలు తెరమీదకు వచ్చాయి. ఇప్పుడు ఎన్నికల వేళ మరోసారి హీట్‌ పెంచుతున్నాయి. అయితే ఆ.. సందేహాలు తెలంగాణకు పాకడం ఆసక్తికరంగా మారింది.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..