Medaram Jatara 2022: గిట్ల కూడా అమ్ముతరా?.. మేడారంలో వింత ఘటన.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..!

|

Feb 12, 2022 | 3:25 PM

Medaram Jatara 2022: తెలంగాణ కుంభమేళ మేడారం భక్త జన సంద్రంగా మారింది. రెండేళ్లకోసారి వచ్చే మహా జాతరతో అటవీ ప్రాంతం భక్తజన కోటితో కిక్కిరిసిపోయింది.

Medaram Jatara 2022: గిట్ల కూడా అమ్ముతరా?.. మేడారంలో వింత ఘటన.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..!
Medaram Jatara
Follow us on

Medaram Jatara 2022: తెలంగాణ కుంభమేళ మేడారం భక్త జన సంద్రంగా మారింది. రెండేళ్లకోసారి వచ్చే మహా జాతరతో అటవీ ప్రాంతం భక్తజన కోటితో కిక్కిరిసిపోయింది. జాతర ముహూర్తానికి మరో నాలుగు రోజులు సమయం ఉండగానే.. భక్తులు పోటెత్తుతున్నారు. దాదాపు నెల రోజులుగా భక్తులు మేడారం ప్రాంతానికి తరలి వస్తున్నారు. అమ్మవార్ల ఆసనాలైన గద్దెలను దర్శించుకుంటున్నారు. తల్లులపై భక్తి పారవశ్యంతో తరించిపోతున్నారు. రెండేళ్ల కోసారి జరిగే ఈ మహా జాతరకు భక్తులు పోటెత్తడం సహజమే. అయితే, ఈ భక్త జనసంద్రాన్ని క్యాష్ చేసుకుంటున్నారు వ్యాపారులు. ముఖ్యంగా మద్యం వ్యాపారులు తమదైన శైలిలో విక్రయాలు జరుపుతున్నారు. మేడారం జాతరలో భాగంగా భక్తులు.. అమ్మవార్లకు కోళ్లు, మేకలను బలిస్తారు. అలా బలి ఇచ్చిన వాటిని అక్కడే అడవి పరిసరాల్లో వంట వండుకుని తింటారు. అందులో భాగంగా మద్యం సేవిస్తుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని లిక్కర్ వ్యాపారలు సరికొత్త ప్లాన్‌కు తెర లేపారు. మునుపెన్నడూ లేని విధంగా మేడారం ప్రాంతంలో మద్యం విక్రయాలు చేపట్టారు.

ఇప్పటి వరకు ముబైల్ ఆంబులెన్స్, మొబైల్ మెకానిక్, వంటి కొన్ని రకాల సేవలను మాత్రమే చూసిన వారికి.. ఇక్కడి మద్యం వ్యాపారులు.. మొబైల్ లిక్కర్ సేల్స్ అనే సరికొత్త విధానాన్ని పరిచయం చేశారు. మేడారం ప్రాంతంలో వ్యాపారులు మద్యాన్ని ముబైల్ వాహనంలో విక్రయిస్తున్నారు. భక్తుల కోసం మొబైల్ వాహనాలను ఏర్పాటు చేసి మద్యాన్ని అమ్ముతున్నారు. గూడ్స్ ఆటోలో తిరుగుతూ.. మద్యం బాటిళ్లు, కూల్ డ్రింక్స్ విక్రయిస్తున్నారు. మేడారం పరిసరాల్లో అడవుల్లో సేదతీరుతున్న భక్తుల వద్దకు వెళ్లి మరీ లిక్కర్ విక్రయాలు జరుపుతున్నారు వ్యాపారులు. ఇక ఈ విధానాన్ని చూసి భక్తులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ సౌకర్యాలు కూడా ఉన్నాయా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మద్యమే మన వద్దకు వచ్చిందంటూ.. నవ్వుకుంటున్నారు. కాగా, ఈ మొబైల్ వైన్స్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. అది చూసి ప్రజలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలాఉంటే.. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరుగనుంది. ఈ తేదీలలో అమ్మవార్లు సమ్మక్క-సారలమ్మ దేవతలను చిలుకల గుట్ట, కన్నెపల్లి నుంచి తీసుకువచ్చి గద్దెలపై ప్రతిష్ఠింపజేస్తారు. విశేష పూజలు నిర్వహిస్తారు. వన దేవతలకు ప్రసాదంగా బంగారాన్ని సమర్పిస్తారు. సమక్క – సారలమ్మలతో పాటు.. జంపన్నను కూడా కొలుస్తారు భక్తులు. ఇప్పటికే ఈ జాతరకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసింది.

Also read:

Andhra Pradesh: దేశంలోనే ఫస్ట్ టైమ్.. 2 లక్షల కేజీల మత్తుకు నిప్పు పెట్టిన ఏపీ పోలీస్ బాస్

VK Naresh: సీఎంతో సినీ ప్రముఖుల భేటీపై స్పందిన నటుడు నరేష్.. అభినందనీయం అంటూనే..

Viral Video: అక్క పెళ్ళిలో చెల్లెలు సందడి.. బిజిలీ బిజిలీ సాంగ్ కు డ్యాన్స్.. నెట్టింట్లో వీడియో వైరల్..