మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు తిరిగి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం బీజేపీ క్రియాశీల సభ్యత్వాన్ని తీసుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆయనకు పార్టీ సభ్యత్వాన్ని అందించి.. తిరిగి పార్టీలోకి ఆహ్వానించారు. తనను పార్టీనే ఇంత పెద్ద స్థాయికి తీసుకెళ్లిందని.. మహారాష్ట్రకు గవర్నర్‌గా వెళ్లే ముందు పార్టీకి రాజీనామా చేసిన సమయంలో తీవ్ర ఆవేదనకు లోనైనట్లు విద్యాసాగర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని.. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరా పనిచేస్తానన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.