Telangana: కాంగ్రెస్ సర్కార్‎పై కేంద్ర మంత్రుల విమర్శలు.. ఈ అంశాలపై ఫోకస్..

తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ పై కేంద్ర మంత్రులు విమర్శలు చేశారు. పార్ఠీ ఫిరాయింపులపై ఒకరు, నిధుల కేటాయింపులపై మరొకరు సీఎం రేవంత్ సర్కార్ ను టార్గెట్ చేశారు. కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తెలంగాణలో అధికారమే లక్ష్యంగా దృష్టి సారించారు. అందుకు తగ్గ కార్యాచరణను రూపొందిస్తూ ముందుకు సాగుతున్నారు. 2029లో తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి వచ్చి తీరతామన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా కాంగ్రెస్‌ ప్రభుత్వ పనితీరుపై విరుచుకుపడ్డారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

Telangana: కాంగ్రెస్ సర్కార్‎పై కేంద్ర మంత్రుల విమర్శలు.. ఈ అంశాలపై ఫోకస్..
Telangana
Follow us

|

Updated on: Jun 30, 2024 | 4:08 PM

తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ పై కేంద్ర మంత్రులు విమర్శలు చేశారు. పార్ఠీ ఫిరాయింపులపై ఒకరు, నిధుల కేటాయింపులపై మరొకరు సీఎం రేవంత్ సర్కార్ ను టార్గెట్ చేశారు. కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తెలంగాణలో అధికారమే లక్ష్యంగా దృష్టి సారించారు. అందుకు తగ్గ కార్యాచరణను రూపొందిస్తూ ముందుకు సాగుతున్నారు. 2029లో తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి వచ్చి తీరతామన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా కాంగ్రెస్‌ ప్రభుత్వ పనితీరుపై విరుచుకుపడ్డారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తూ.. ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తోందన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ రెండూ మోసపూరిత పార్టీలేనని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే పరిస్థితి లేదన్నారు కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి ఇతరపార్టీల గుర్తులపై గెలిచిన ఎమ్మెల్యేలను వారి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారన్నారు. గతంలో ప్రజాస్వామ్యాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా అపహాస్యం చేశారో అదే తీరును కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి అవలంభిస్తున్నారన్నారు.

ఇక ఇదే క్రమంలో కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ తీరును తప్పుబట్టారు. తెలంగాణలో అసెంబ్లీకి ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలకు నిధులు మంజూరు చేయడం లేదని సీఎం రేవంత్ సర్కార్‎పై ఫైర్ అయ్యారు. కేవలం కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు మాత్రమే నిధులు సమకూర్చడం సబబుకాదన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులే ఇప్పుడు కాంగ్రెస్ చేస్తోందని ఆరోపించారు. బీజేపీ కూడా ఇదే విధంగా బీజేపీ పాలిత ప్రాంతాలకు మాత్రమే నిధుల ఇస్తామంటే అందుకు కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. ఎన్నికల వరకు రాజకీయాలని తమ నాయకుడు ప్రధాని మోదీ చెప్పిన మాటలను మరోసారి గుర్తు చేశారు. గెలిచిన తరువాత అందరినీ సమానంగా చూడాలన్నారు. ఇలాంటి సాంప్రదాయం సరైనది కాదని పద్దతి మార్చుకోవాలని సూచన చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‎పై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో జనసేనతో కలిసి నడిచే విషయం కేంద్ర పెద్దలు, బీజేపీ అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, బీజేపీ జాతీయ అధ్యక్షులు కలిసి తీసుకునే నిర్ణయం ప్రకారం తాము నడుచుకుంటామని స్పష్టం చేశారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామెంట్స్..

హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ కామెంట్స్..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..