Trivikram: ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్ మధ్య త్రివిక్రమ్.. గురూజీ అడుగులెటు.?

Trivikram: ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్ మధ్య త్రివిక్రమ్.. గురూజీ అడుగులెటు.?

Anil kumar poka

|

Updated on: Jul 02, 2024 | 10:24 AM

గురూజీ కష్టపడుతున్నారు. ఖాళీ లేకుండా... పరిగెడుతున్నారు. ఓ వైపు తన సినిమాల పనులు.. మరో వైపు తన ప్రొడ్యూస్ చేసే సినిమా పనులు. ఇలా రెండు చేతులా.. సినిమా పనులతో బిజీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇక ఈ మధ్యలోనే మన గురూజీకి మరో చిక్కు వచ్చి పడింది. ఇప్పుడా చిక్కు నుంచి గురూజీ పయనమెటో అనే ఈగర్ అందర్లో పెరిగిపోయింది. ఓ పక్క ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం పుష్ప2 సినిమాతో బిజీగా ఉన్నారు.

గురూజీ కష్టపడుతున్నారు. ఖాళీ లేకుండా… పరిగెడుతున్నారు. ఓ వైపు తన సినిమాల పనులు.. మరో వైపు తన ప్రొడ్యూస్ చేసే సినిమా పనులు. ఇలా రెండు చేతులా.. సినిమా పనులతో బిజీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇక ఈ మధ్యలోనే మన గురూజీకి మరో చిక్కు వచ్చి పడింది. ఇప్పుడా చిక్కు నుంచి గురూజీ పయనమెటో అనే ఈగర్ అందర్లో పెరిగిపోయింది. ఓ పక్క ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం పుష్ప2 సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అయిపోగానే.. త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ సినిమా చేద్దామనట్టు ప్లాన్ చేసుకుంటున్నారట. అల వైకుంఠ పురం రేంజ్‌ హిట్‌ను రిపీట్ చేద్దామని అనుకుంటున్నారట.

ఇంకో పక్క మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈయన కూడా ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అయిపోగానే.. త్రివిక్రమ్ కాంపౌండ్‌లో ల్యాండ్ అయిపోయి.. ఓ సినిమా చేయాలని థింక్ చేస్తున్నారట. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ చెంతన చేరిపోవాలన్నది యంగ్ టైగర్ ప్లాన్ అట. అయితే ఈ ఇద్దరు హీరోలు.. తాము ప్రస్తుతం చేస్తున్న సినిమా తర్వాత త్రివిక్రమ్‌తోనే సినిమా మొదలెట్టాలని చూస్తుండడంతో.. ఆ విషయం నెట్టింట లీక్ అవ్వడంతో.. ఇప్పుడు గురూజీ పయనమెటో అనే కామెంట్ నెట్టింట కనిపిస్తోంది. త్రివిక్రమ్ వంకే అందర్నీ చూసేలా చేస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.