Watch Video: అంగవైకల్యం మనిషికే కానీ ఆలోచనకు కాదు..ఈ యువకుడు ఎందరికో ఆదర్శం..

ఒక్కొక్కరి జీవితం ఒకలా ఉంటుంది. ఏం చేసినా ఎంత కష్టపడినా బానెడు పొట్ట కోసమే. అలా ఎంతో మంది పేద యువత కుటుంబాన్ని పోషించడానికి గ్రామాల నుంచి వలస వచ్చి నగరంలో కాయకష్టం చేసి బతుకు బండిని నడిపే వారెందరో. అలాంటి వాళ్లు ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో అడుగడుగునా కనిపిస్తుంటారు. ఒక్కొక్కరిది ఒక్కో కన్నీటి గాథ. కదిలిస్తే ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి. అలాంటి ఒక వ్యక్తి పడుతున్న కష్టం గురించి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

Watch Video: అంగవైకల్యం మనిషికే కానీ ఆలోచనకు కాదు..ఈ యువకుడు ఎందరికో ఆదర్శం..
Food Delivery
Follow us

| Edited By: Srikar T

Updated on: Jul 02, 2024 | 12:55 PM

ఒక్కొక్కరి జీవితం ఒకలా ఉంటుంది. ఏం చేసినా ఎంత కష్టపడినా బానెడు పొట్ట కోసమే. అలా ఎంతో మంది పేద యువత కుటుంబాన్ని పోషించడానికి గ్రామాల నుంచి వలస వచ్చి నగరంలో కాయకష్టం చేసి బతుకు బండిని నడిపే వారెందరో. అలాంటి వాళ్లు ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో అడుగడుగునా కనిపిస్తుంటారు. ఒక్కొక్కరిది ఒక్కో కన్నీటి గాథ. కదిలిస్తే ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి. అలాంటి ఒక వ్యక్తి పడుతున్న కష్టం గురించి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ నగరం ఎంతో మందికి జీవనాధారం. ఇక్కడ నివసిస్తూ పొట్టకూటి కోసం కష్టపడుతున్న యువత ఎంతో మంది. నగరంలోని అనేక ప్రాంతాల్లో దోపిడీలు, హత్యలు, హత్యాయత్నాలు చేసుకుని కొందరు చనిపోతున్న ఘటనలు మనం చూస్తూనే ఉంటాం. ఇలాంటి పరిస్థితుల నడుమ కూడా కొంత మంది యువకులు కష్టాల్లో ఉన్న వాళ్లకి అండగా ఉంటూ వారికి తోచిన రీతిలో సాయపడుతూ ఆదుకుంటున్న వాళ్లు కూడా లేకపోలేదు. ఇదిలా ఉంటే, మరి కొంతమంది యువకులు కష్టపడి జీవితంలో ముందుకు సాగడానికి ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి ఒక వ్యక్తి చేస్తున్న పని ఇక్కడ ఎంతో మందిని కదిలిస్తుంది. నగరంలోని పాతబస్తీ ప్రాంతంలో ఓ వికలాంగుడు రాత్రీపగలూ కష్టపడుతూ జోమాటోలో పని చేస్తున్నాడు. చివరికి భారీ వర్షం పడుతున్నా కూడా లెక్క చేయకుండా తన విధి నిర్వహణను సాగిస్తున్నాడు. వర్షం నుంచి తనకు తాను రక్షించుకుంటూ చేసే పనిని వదలకుండా ద్విచక్రవాహనంపై వెళ్తున్న దృశ్యాలు చూస్తున్న ప్రజల హృదయాలను కదిలిస్తోంది.

అన్ని అవయవాలు సక్రమంగా ఉండి కూడా సమయం వృథా చేస్తూ, కన్నవాళ్ల మీద ఆధారపడి జులాయిలుగా మారుతున్న యువత ఉన్న ఈ కాలంలో.. వికలాంగుడు అయి కూడా తన కుటుంబాన్ని పోషించడానికి ఈ యువకుడు పడుతున్న శ్రమని చూస్తే ఖచ్చితంగా మెచ్చుకుని తీరాల్సిందే. ఈ యువకుడు మన చుట్టూ ఉన్న ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. జీవితం ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో అన్నీ నేర్పిస్తుంది. కనీసం మనం ఇలాంటి వాళ్ళనైనా చూసి ఆదర్శంగా తీసుకుని చెడు దారులలో వెళ్లకుండా కష్టపడితే జీవితంలో ఎంతో సాధించవచ్చు, మనం కూడా మరికొందరికి ఆదర్శంగా నిలవవచ్చు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..