తెలంగాణ కొత్త ట్రాఫిక్ రూల్స్ ఇవే..

TV9 Telugu

04 July 2024

సాధారణ నేరం విషయంలో మునుపటి జరిమానా ₹100 రూపాయిలు ఉండగా.. ప్రస్తుతం ఈ జరిమానా ₹500 రూపాయలకు పెంచారు.

రెడ్ సింగల్ క్రాసింగ్ కి మునుపటి జరిమానా ₹100 రూపాయిలు కాగా ప్రస్తుతం దీని జరిమానా ₹500 రూపాయలకు చేరింది.

అథారిటీ ఆదేశాలను ధిక్కరించిన్నట్లు అయితే గతంలో ₹500 జరిమానను ప్రస్తుత ₹2000కు పెంచారు ట్రాఫిక్ అధికారులు.

లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే మునుపటి జరిమానా ₹500, ప్రస్తుత జరిమానా ₹5000. అలాగే అతివేగనికి ₹400ని ₹1000 చేసారు.

ప్రమాదకరమైన డ్రైవింగ్ చేస్తే ₹1000 ఉండగా.. ప్రస్తుతం ₹5000. మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే..:₹2,000 నుంచి ₹10,000కు పెరిగింది.

రేసింగ్ లేద ఓవర్ స్పీడింగ్ కి మునుపటి జరిమానా ₹500 ఉండగా ప్రస్తుతం ఈ జరిమానా ₹5,000 రూపాయలకు పెరిగింది.

హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తే ₹100 రూపాయలను ₹1000కు పెంచడమే మాత్రం కాదు మూడు నెలలకు లైసెన్స్ కూడా రద్దు చేస్తారు.

సీట్‌బెల్ట్ ధరించకపోతే ఉన్న ₹100ను ₹1000 చేసారు. అలాగేఅత్యవసర వాహనాలకు దారివ్వకపోతే ₹10,000 జరిమానా.

ద్విచక్ర వాహనాలపై ట్రిపుల్ రైడింగ్ కి ₹1200 జరిమానా.  ఓవర్‌లోడ్ కి  ₹2000 జరిమానా + మూడు నెలలకు లైసెన్స్ రద్దు.

బీమా లేకుండా డ్రైవింగ్ చేసినట్లు అయితే ₹1000 రూపాయిలు ఉన్న జరిమానని ప్రస్తుతం ₹2,000కు పెంచారు అధికారులు.