Lok Sabha: ‘ఇండియా అభ్యర్థి విజయం రాముడి తీర్పు’.. ఎంపీ అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు..

లోక్ సభలో నిన్నటి రాహుల్ ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలను తొలగించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను చేసిన వ్యాఖ్యలు తొలగిచడాన్ని తప్పుబట్టారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తన ప్రపంచంలోని సత్యాన్ని తొలగించగలరు.. కానీ వాస్తవ ప్రపంచంలోని సత్యాన్ని తొలగించలేరన్నారు. తాను చెప్పాల్సింది చెప్పానని, అదే నిజమని వాటికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నానన్నారు. ఎన్ని వ్యాఖ్యలు తొలగిస్తారో తొలగించనీయండని చెప్పారు.

Lok Sabha: 'ఇండియా అభ్యర్థి విజయం రాముడి తీర్పు'.. ఎంపీ అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు..
Akhilesh Yadav
Follow us

|

Updated on: Jul 02, 2024 | 1:00 PM

లోక్ సభలో నిన్నటి రాహుల్ ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలను తొలగించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను చేసిన వ్యాఖ్యలు తొలగిచడాన్ని తప్పుబట్టారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తన ప్రపంచంలోని సత్యాన్ని తొలగించగలరు.. కానీ వాస్తవ ప్రపంచంలోని సత్యాన్ని తొలగించలేరన్నారు. తాను చెప్పాల్సింది చెప్పానని, అదే నిజమని వాటికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నానన్నారు. ఎన్ని వ్యాఖ్యలు తొలగిస్తారో తొలగించనీయండని చెప్పారు.

రాహుల్ వీడియో..

ఇదే క్రమంలో ఇండియా కూటమిలో భాగస్వామి అయిన సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ లోక్ సభలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ముందుగా అయోధ్యలో తన పార్టీ ఎంపీ గెలవడంపై చిన్ని కవితను చదివి వినిపించారు. దీంతో నైతికంగా ఇండియా కూటమి గెలిచిందన్న అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇదే సందర్భంగా ఎన్డీయే ప్రభుత్వంపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఎన్డీయే ప్రభుత్వం కూలిపోతుందని జోస్యం చెప్పారు. బీజేపీ 400 సీట్ల అజెండా విఫలమయ్యిందని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వదలుచుకోలేదని విమర్శించారు. అందుకే ఈ పేపర్ లీకేజ్ ఘటనలు జరుగుతున్నాయని ఘాటుగా స్పందించారు. అందుకే ఇది ఓడిపోయిన ప్రభుత్వం అని అభివర్ణించారు. మతతత్వ రాజకీయాలు ఈ ఎన్నికల్లో ఓడిపోయాయని చెప్పారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఏం చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. అయోధ్యలో తమ ఇండియా కూటమి అభ్యర్థి విజయం అనేది రాముడి తీర్పుగా అభివర్ణించారు. అలాగే ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల వ్యవస్థపై లోక్‌సభలో కీలక వ్యాఖ్యలు చేశారు అఖిలేష్ యాదవ్‌. ఈవీఎంల పనితీరుపై‌ విమర్శలు గుప్పించారు. EVMల మీద ఇదివరకు, ఇప్పుడు కూడా తనకు నమ్మకం లేదన్నారు. యూపీలో మొత్తం 80 లోక్‌సభ సీట్లు గెలిచినా ఈవీఎంలను నమ్మనన్నారు అఖిలేష్. ఎన్నికల ప్రక్రియ నుంచి ఈవీఎంలు తొలగించేదాకా తమ పోరాటం ఆగదన్నారు.

అఖిలేష్ కామెంట్స్..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బెదిరించి తీసుకువెళ్లాడని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చిన యువతి
బెదిరించి తీసుకువెళ్లాడని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చిన యువతి
మాంసాహారం లేనిదే ముద్ద దిగదా..! ఈ సీజన్‌లో ఈ ఆహారం తినొద్దు
మాంసాహారం లేనిదే ముద్ద దిగదా..! ఈ సీజన్‌లో ఈ ఆహారం తినొద్దు
కంగనాను కొట్టిన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‏కు ఊహించని షాక్..
కంగనాను కొట్టిన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‏కు ఊహించని షాక్..
టార్చ్ లైట్ పట్టుకొని జనమే వస్తారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..
టార్చ్ లైట్ పట్టుకొని జనమే వస్తారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..
హైదరాబాద్‏లో మూడు చోట్ల సరికొత్త రికార్డులు..
హైదరాబాద్‏లో మూడు చోట్ల సరికొత్త రికార్డులు..
గుప్త నవరాత్రులు చేస్తున్నారా కలశ ఏర్పాటు చేయడంలో నియమాలు ఏమిటంటే
గుప్త నవరాత్రులు చేస్తున్నారా కలశ ఏర్పాటు చేయడంలో నియమాలు ఏమిటంటే
లడ్డూ కౌంటర్‎లో అక్రమాలు.. ఉద్యోగులపై ఈవో సస్పెన్షన్ వేటు..
లడ్డూ కౌంటర్‎లో అక్రమాలు.. ఉద్యోగులపై ఈవో సస్పెన్షన్ వేటు..
జామ పండ్లతోనే కాదు.. ఆకులలో కూడా ఔషధ గుణాలు.. తెలిస్తే ఆశ్చర్యమే!
జామ పండ్లతోనే కాదు.. ఆకులలో కూడా ఔషధ గుణాలు.. తెలిస్తే ఆశ్చర్యమే!
మత్తుమందు ఇచ్చి కారులో రేప్ చేసిన తోటి ఉద్యోగులు
మత్తుమందు ఇచ్చి కారులో రేప్ చేసిన తోటి ఉద్యోగులు
పూరీ ఆలయమే కాదు.. రథయాత్రలో కూడా ఎన్నో అద్భుతాలు..
పూరీ ఆలయమే కాదు.. రథయాత్రలో కూడా ఎన్నో అద్భుతాలు..