బీఎస్‌ఎన్‌ఎల్‌లో కళ్లు చెదిరే ప్లాన్‌..చౌక ధరల్లో 45 రోజుల వ్యాలిడిటీ

03 July 2024

TV9 Telugu

దేశీయ ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌) కొత్త కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఓ సరికొత్త ప్లాన్‌ను తీసుకువచ్చింది.

బీఎస్‌ఎన్‌ఎల్‌

ఈ ప్లాన్‌ ధర రూ.249 మాత్రమే. వ్యాలిడిటీ విషయానికొస్తే 45 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ చేసుకోవచ్చు.

ఈ ప్లాన్‌ ధర 

అంతేకాకుండా ఈ బీఎస్‌ఎన్‌ఎల్‌ సరికొత్త ప్లాన్‌లో రోజూ 2జీబీ డాటా, 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లను వినియోగదారులు వాడుకోవచ్చు. 

బీఎస్‌ఎన్‌ఎల్‌

ప్రైవేట్‌ రంగ టెలికం కంపెనీలు రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా.. ఇటీవలే తమ ప్లాన్ల ధరలను భారీగా పెంచుతున్నట్టు ప్రకటించాయి.

ప్రైవేట్‌ రంగ టెలికం

బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్లాన్‌ ఇప్పుడు టెలికం ఇండస్ట్రీలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ప్రైవేటు కంపెనీలకు ధీటుగా ప్లాన్స్‌ తీసుకువస్తోంది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్లాన్‌

అధిక టారీఫ్‌ల నుంచి ఉపశమనాన్ని కోరుకునే మొబైల్‌ యూజర్లను ఆకట్టుకునేందుకే బీఎస్‌ఎన్‌ఎల్‌ తక్కువ ధరకే ఎక్కువ ప్రయోజనాలు అందుకోవచ్చు.

అధిక టారీఫ్‌

నిజానికి ఇతర టెలికం కంపెనీలు ఇదే ధర (రూ.249)కు రోజుకు 1జీబీ డాటానే ఇస్తుండగా, వ్యాలిడిటీ కూడా 28 రోజులే ఉంటుండటం గమనార్హం.

ఇతర టెలికం కంపెనీలు

బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త ప్లాన్‌లో రోజువారీ డేటా రెట్టింపుతో పాటు ప్లాన్‌ గడువు కూడా 17 రోజులు పెరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మొబైల్‌ వినియోగదారులకు ఇది గొప్ప ఊరటగానే చెప్పుకోవచ్చు. 

రోజువారీ డేటా