Amit Shah Hyderabad Tour: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా నేడు హైదరాబాద్‌కు రానున్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రమ (Praja Sangrama Yatra) యాత్ర ముగింపు సందర్భంగా బహిరంగ సభకు హాజరు కానున్నారు. శనివారం హైదరాబాద్‌కు రానున్న అమిత్ షా.. మధ్యాహ్నం 2.30 గంటలకు బేగంపేట విమానాశ్రయింలో దిగనున్నారు. 3 గంటలకు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీని సందర్శించి సాయంత్రం 4.30 గంటల వరకు ఉండనున్నారు. అలాగే 5 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని నోవా టెల్ హోటల్‌కు వెళ్లనున్నారు. 6.30 గంటలకు హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జరిగే బహిరంగ సభలో అమిత్ షా హాజరై ప్రసంగించనున్నారు.
అనంతరం రాత్రి 8 గంటలకు సభ స్థలి నుంచి ఎయిర్‌పోర్టుకు వచ్చి రాత్రి 8.25 గంటలకు ఢిల్లీ తిరుగు ప్రయాణం అవుతారు. కాగా, అమిత్ షా పర్యటన ఖరారు కావడంతో సభకు భారీ సంఖ్యలో ప్రజలను సమీకరించడంలో బీజేపీ నిమగ్నమైంది. అయితే సభకు 5 లక్షల మందిని తరలించేందుకు బీజేపీ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. సభలో అమిత్‌షా ప్రసంగంపై ఆసక్తి నెలకొంది.
ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కిషన్ రెడ్డి, డికె అరుణ ,ఈటల రాజేందర్‌లు పరిశీలించారు. కేంద్రం పై సీఎం కేసీఆర్ విమర్శలకు, కేటీఆర్ లేఖకు అమిత్ షా ఎలాంటి సమాధానం చెబుతారనేది ఆసక్తికరంగా మారింది. గత త కొంతకాలంగా తెలంగాణపై అమిత్ షా ప్రత్యేకమైన దృష్టి సారిస్తున్నారు. బండి సంజయ్ అరెస్ట్ అప్పుడు, ఇటీవల ఖమ్మం లో బీజేసీ కార్యకర్త సాయి మృతి చెందినప్పుడు ఆయన నేరుగా స్పందించడం జరిగింది. మరోపక్క ఢిల్లీలో కూడా ఇక్కడి నాయకులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. తెలంగాణలో అమిత్ షా తన ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారని కూడా ప్రచారం జరిగింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి