Salary Hike: ఇంక్రిమెంట్ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు శుభవార్త..

Salary Hike: ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఈ ఏడాది అన్ని రంగాల్లోని చాలా మంది ఉద్యోగుల జీతాలు పెరిగే అవకాశం ఉంది. TeamLease ది జాబ్స్ అండ్ శాలరీ ప్రైమర్ రిపోర్ట్..

Salary Hike: ఇంక్రిమెంట్ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు శుభవార్త..
Follow us

|

Updated on: May 13, 2022 | 1:47 PM

Salary Hike: ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఈ ఏడాది అన్ని రంగాల్లోని చాలా మంది ఉద్యోగుల జీతాలు పెరిగే అవకాశం ఉంది. TeamLease ది జాబ్స్ అండ్ శాలరీ ప్రైమర్ రిపోర్ట్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గత రెండేళ్లతో పోలిస్తే ఈ సంవత్సరం దాదాపు అన్ని రంగాలలో పనిచేస్తున్న ఉద్యోగుల వార్షిక వేతనంలో పెరుగుదల ఉండవచ్చు. అయితే జీతాల పెంపు పరిమితంగానే ఉంటుంది. ఈ ఏడాది ఉద్యోగుల జీతం దాదాపు 8.13 శాతం పెరగవచ్చు. నివేదికలో 17 రంగాలను సమీక్షించగా, అందులో 14 రంగాలు 10 శాతం కంటే తక్కువ వేతనాలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. అదే సమయంలో, సగటు జీతం పెంపు 8.13 శాతంగా అంచనా వేయబడింది.

టీమ్‌లీజ్ సర్వీసెస్ వార్షిక నివేదిక 17 రంగాలు, తొమ్మిది నగరాల్లోని 2,63,000 మంది ఉద్యోగుల జీతాల చెల్లింపులను పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ నగరాల్లో జీతం 12 శాతానికి పైగా పెరుగుతుంది. నివేదిక ప్రకారం.. భౌగోళిక ప్రాతిపదికన అత్యధికంగా 12 శాతం, అంతకంటే ఎక్కువ జీతాలు పెంచుతున్న నగరాల్లో అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, పూణే ఉన్నాయి. ఇది కాకుండా, ఇ-కామర్స్, టెక్నాలజీ స్టార్టప్‌లు, ఆరోగ్యం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి రంగాలలో వార్షిక ప్రాతిపదికన జీతంలో అతిపెద్ద పెరుగుదల 10 శాతానికి పైగా ఉంటుందని అంచనా ఉంది.

ఇందులో 10 శాతం కంటే ఎక్కువ పెరిగే అవకాశం:

ఇవి కూడా చదవండి

వ్యవసాయం అండ్‌ ఆగ్రోకెమికల్స్, ఆటోమొబైల్స్ అండ్‌ అనుబంధిత, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్‌ ఇన్సూరెన్స్, BPO అండ్‌ IT ఎనేబుల్డ్ సర్వీసెస్, కన్స్ట్రక్షన్ అండ్‌ రియల్ అసెట్, ఎడ్యుకేషనల్ సర్వీసెస్, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్, హాస్పిటాలిటీ, ఇండస్ట్రియల్ ది మాన్యుఫ్రెటింగ్ అని నివేదిక పేర్కొంది. అనుబంధ, మీడియా మరియు వినోదం, విద్యుత్ మరియు శక్తి, రిటైల్ మరియు టెలికమ్యూనికేషన్ రంగాలు 10 శాతం కంటే తక్కువ వృద్ధిని నమోదు చేశాయి.

టీమ్‌లీజ్ సర్వీసెస్ సహ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రితుపర్ణ చక్రవర్తి మాట్లాడుతూ.. వేతన పెంపు ఇప్పటికీ 10 శాతం కంటే తక్కువగా ఉంది. శుభవార్త ఏంటంటే.. ఇప్పుడు జీతాల కోత శకం ముగిసింది. పునరుద్ధరణ, వివిధ రంగాలలో పెరుగుతున్న డిమాండ్‌తో, జీతాల పెంపు ప్రీ-కోవిడ్ స్థాయికి చేరుకునే మార్గంలో ఉంది అని అన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి