2 Headed Snake: ములుగు జిల్లాలో అరుదైన పాము.. దీన్ని గురించి మీరు తెలుసుకోవాల్సిన నిజం ఇదే

|

May 22, 2023 | 8:08 PM

సృష్టిలో మిగిలిన జీవుల్లా ఇది ఒక సాధారణమైన సర్పజాతికి చెందిన పాము. ఇవి దగ్గర ఉంటే కోటీశ్వర్లు అయిపోతారని.. కుబేరుడు ఇంట్లోనే తిష్టవేసుకుంటాడని కొందరు మాయగాళ్లు ప్రచారం చేస్తుంటారు. అదంతా అస్సలు నమ్మకండి.

2 Headed Snake: ములుగు జిల్లాలో అరుదైన పాము.. దీన్ని గురించి మీరు తెలుసుకోవాల్సిన నిజం ఇదే
2 Headed Snake
Follow us on

ఒక తలపామును పాము కనపడితే చాలా మంది అదురుకుంటారు. ఇంకా 2 తలల పాము కనిపిస్తే ఏమైనా ఉందా..? అక్కడి నుంచి పరుగో పరుగు అంతే. అయితే  ఈ పాములు ఎలాంటి హాని చెయ్యవ్. ఈ పాము గురించి బయట రకరకాల ప్రచారాలు కూడా ఉన్నావ్. ఇవి ఇంట్లో ఉంటే కుబేరులు అవుతారని.. అపారమైన సంపద కలివస్తుందని బయట ప్రచారం ఉంది. ఇవే మాటలు చెప్పి చాలామంది స్మగ్లర్లు వీటిని పట్టి భారీ ధరకు అమ్ముకుంటూ ఉంటారు. ఈ పాము చుట్టూరా ఉన్న ప్రచారం ఫేక్. ఇంకా చెప్పాలంటే ఈ పాముకు 2 తలలు కూడా ఉండవు. ఇవి ఎలుక బొరియల్లోకి ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి. ఆ సమయంలో ఎలుకలు దాన్ని అటాక్ చేయడం వల్ల రెండో వైపు తలను పోలిన ఆకారం వస్తుంది. ఇవి ఎక్కువగా చిత్తడి నేలలు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటాయి.

తాజాగా ములుగు జిల్లాలో ఈ తరహా పామును గుర్తించారు స్థానికులు. వాజేడు మండలం ప్రగల్లపల్లి గ్రామ సమీపంలో రెండు తలలు పోలిన విచిత్ర రూపంలో పాము కదులుతూ ఉండటం గమనించారు. సుమారు మీటరు పొడవు, మూడు కిలోల బరువున్న ఈ పామున చూసి జనం ఆశ్చర్యంగా చూశారు. స్నేక్ క్యాచర్ సహకారంతో ఆ పామును పట్టుకుని వెంకటాపురం సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలేశారు అటవీశాఖ సిబ్బంది. అరుదైన ఈ సర్పాన్ని రక్షించే క్రమంలో భాగంగా వణ్యప్రాణి సంరక్షణ చట్టం షెడ్యూల్‌–4లో చేర్చారు. 2 తలల పాము అమ్మకాలు జరిపినా, వాటికి అతీత శక్తులున్నాయని ఎవరైనా ప్రచారం చేసినా కఠిన చర్యలు ఉంటాయి.  ఈ పాముకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా టోల్‌ఫ్రీ నంబర్‌ 18004255364కు కంప్లైంట్ చేయాలని అటవీ శాఖ సిబ్బంది సూచించారు.