TSRTC: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల వేళ.. ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు యాజమాన్యం శుభవార్త తెలిపింది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మరో విడత కరవ భత్యం (డీఏ) ఇవ్వాలని నిర్ణయించినట్లు టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్‌లు వెల్లడించారు. జులై 2022లో ఇవ్వాల్సి ఉన్న 4.9 శాతం డీఏను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

TSRTC: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల వేళ.. ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త
Tsrtc Employees

Updated on: Jun 01, 2023 | 4:53 PM

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు యాజమాన్యం శుభవార్త తెలిపింది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మరో విడత కరవ భత్యం (డీఏ) ఇవ్వాలని నిర్ణయించినట్లు టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్‌లు వెల్లడించారు. జులై 2022లో ఇవ్వాల్సి ఉన్న 4.9 శాతం డీఏను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. జూన్ నెల జీతంతో కలిపి డీఏను ఉద్యోగులకు అందజేయనున్నట్లు వెల్లడించారు.

తెలంగాణ ఉద్యమంలో టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులు కీలక పాత్ర పోషించారు. 2011లో దాదాపు 29 రోజుల పాటు సకల జనుల సమ్మెలో పాల్గొని ప్రత్యేక రాష్ట్రం కోసం కృషి చేశారు. ఆ తరుణంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల సందర్భంగా పెండింగ్‌లో ఉన్న ఏడో డీఏను ఉద్యోగులకు మంజూరు చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఉద్యోగులకు సంస్థ ఏడు డీఏలను మంజూరు చేసిందని తెలిపారు. ఇప్పుడు మిగిలిఉన్న ఒక్క డీఏను సైతం త్వరలోనే ఉద్యోగులకు రానుందని స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి..

ఇవి కూడా చదవండి

 

Loading...
Unable to load recommendations.
Follow Us