Sajjanar: అక్కడికి ఆర్టీసీ బస్ వేయండి.. నెటిజన్ ట్వీట్ కు స్పందించిన సజ్జనార్

|

Mar 20, 2022 | 9:56 PM

సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆర్టీసీ ఎండీ స‌జ్జనార్ (Sajjanar) సామాజిక మాధ్యమాల (Social Media) ద్వారా త‌న దృష్టికి వ‌చ్చే స‌మ‌స్యల‌ను ప‌రిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. రూల్స్ పాటించ‌ని అధికారుల..

Sajjanar: అక్కడికి ఆర్టీసీ బస్ వేయండి.. నెటిజన్ ట్వీట్ కు స్పందించిన సజ్జనార్
Sajjanar
Follow us on

సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆర్టీసీ ఎండీ స‌జ్జనార్ (Sajjanar) సామాజిక మాధ్యమాల (Social Media) ద్వారా త‌న దృష్టికి వ‌చ్చే స‌మ‌స్యల‌ను ప‌రిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. రూల్స్ పాటించ‌ని అధికారుల విష‌యంలోనూ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటూ.. ప్రజలు ఆర్టీసీ బస్సులను ఆశ్రయించే విధంగా పలు చర్యలు చేపడుతున్నారు. సమస్యలను పరిష్కరిస్తూ, సమస్యలను సమన్వయం చేసుకుంటూ, కొత్త కొత్త విధానాలను ప్రవేశ‌పెడుతూ త‌న‌దైన మార్క్ చూపిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ నెటిజన్ చేసిన ట్వీట్ కు సజ్జనార్ స్పందించారు. హైదరాబాద్‌ (Hyderabad) శివారులోని ముచ్చింతల్ సమతామూర్తి విగ్రహం వద్దకు వీకెండ్‌లో ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని అధికారులను సజ్జనార్ ఆదేశించారు. సమతామూర్తి విగ్రహం వద్దకు నేరుగా ఆర్టీసీ బస్సుల్లేవని, అక్కడికి వెళ్లేందుకు క్యాబ్ వాళ్లు రూ.1000 వరకు వసూలు చేస్తున్నారని ట్విట్టర్‌లో ఎండీ సజ్జనార్‌ దృష్టికి ఓ నెటిజన్ తీసుకెళ్లారు.

వీకెండ్‌లో అక్కడికి ఆర్టీసీ బస్‌లను ఏర్పాటు చేస్తే.. సామాన్యులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని విజ్ఞప్తి చేశారు. ఈ ట్వీట్‌కు సజ్జనార్ సానుకూలంగా స్పందించారు. ‘ఆర్టీసీ పట్ల మీ ఆసక్తికి ధన్యవాదాలు. ఈ మార్గంలో ఆర్టీసీ బస్‌ను ఏర్పాటు చేయండి. అందుకు అనుగుణంగా సమయాలను అప్‌డేట్ చేయండి’అని ఆర్టీసీ అధికారులను ఆయన ఆదేశించారు. ఆర్టీసీ ఉన్నతాధికారుల ఖాతాలను ట్యాగ్ చేశారు.

Also Read

Hansika motwani: వన్నె తగ్గని గ్లామర్ తో కవ్విస్తున్న దేశముదురు భామ.. హన్సిక లేటెస్ట్ ఫొటోస్..

AP Weather Alert: ఏపీ వాసులకు ‘తుఫాన్’ గండం.. రానున్న మూడురోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో వర్షాలు కురిసే అవకాశం

T.Congress: కాంగ్రెస్ సీనియర్ల మీటింగ్‌లో ట్విస్టుల మీద ట్విస్టులు.. చివరికి ఏం తేల్చారంటే?