TSRTC: టీఎస్ఆర్టీసీ ఉగాది ఆఫర్.. పండుగ రోజంతా ఫ్రీగా ప్రయాణం.. వారికి మాత్రమే

తెలంగాణ ఆర్టీసీని(TSRTC) లాభాల్లోకి తీసుకువచ్చేందుకు సంస్థ ఎండీ సజ్జనార్(Sajjanar) చాలా కృషి చేస్తున్నారు. ఈ మేరకు ఆర్టీసీలో వినూత్న పథకాలు, స్కీంలు, ఆఫర్లు ప్రకటిస్తూ జనాల్లో ఆర్టీసీపై ఉన్న ఆదరణను మరింత పెంచుతున్నారు....

TSRTC: టీఎస్ఆర్టీసీ ఉగాది ఆఫర్.. పండుగ రోజంతా ఫ్రీగా ప్రయాణం.. వారికి మాత్రమే
Tsrtc Md Sajjanar
Follow us
Ganesh Mudavath

|

Updated on: Mar 31, 2022 | 8:42 PM

తెలంగాణ ఆర్టీసీని(TSRTC) లాభాల్లోకి తీసుకువచ్చేందుకు సంస్థ ఎండీ సజ్జనార్(Sajjanar) చాలా కృషి చేస్తున్నారు. ఈ మేరకు ఆర్టీసీలో వినూత్న పథకాలు, స్కీంలు, ఆఫర్లు ప్రకటిస్తూ జనాల్లో ఆర్టీసీపై ఉన్న ఆదరణను మరింత పెంచుతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ప్రగతి రథ చక్రాలను పరుగులు తీయిస్తున్నారు. ఏ పండుగ వచ్చినా..? ఏ ప్రత్యేక ఉన్నా..? ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్లు(Special Offers) తీసుకువస్తున్నారు. నష్టాల ఊబి నుంచి ఆర్టీసీని గట్టెక్కించేందుకు తన వంతు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు ప్రజల నూతన సంవత్సరం ఉగాది పర్వదినం సందర్భంగా మరో ఆఫర్ ప్రకటించారు. ఉగాది పండుగ సందర్భంగా 65 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చని సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. కేవలం ఏప్రిల్‌ 2వ తేదీన మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. బస్సుల్లో ప్రయాణించేటపుడు తమ దగ్గర ఉన్న గుర్తింపు కార్డును కండక్టర్‌కు చూపించి ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చని సూచించారు.

మరోవైపు.. హైదరాబాద్ మెట్రో ప్రయాణీకుల కోసం సరికొత్త ఆఫర్ తీసుకువచ్చింది. సూపర్ సేవర్ కార్డు(Super Saver Card)ను ఎల్ అండ్ టీ ఎండీ కె.వి.బి.రెడ్డి ప్రారంభించారు. ఈ కార్డుతో సెలవుల్లో రూ.59తో రోజంతా మెట్రోలో తిరగొచ్చని ఆయన చెప్పారు. మెట్రో వర్గాలు ప్రకటించిన 100 రోజుల సెలవుల్లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని వివరించారు. నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రోజంతా తిరగొచ్చని స్పష్టం చేశారు. ఉగాది(Ugadi) నుంచి మెట్రోలో సూపర్‌ సేవర్‌ కార్డులు విక్రయించనున్నట్లు ఎండీ ప్రకటించారు.

Also Read

RRR Movie: నేపాల్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ ఫీవర్‌.. స్ర్కీన్‌ ముందు ఫ్యాన్స్‌ ఎలా ఊగిపోతున్నారో మీరే చూడండి..

Pakistan Politics: అవిశ్వాస తీర్మానంపై చర్చకు విపక్షాల పట్టు.. గందరగోళం నడుమ పాక్ పార్లమెంట్‌లో ఏప్రిల్ 3కి వాయిదా!

Traffic restrictions: వాహనదారులకు అలర్ట్.. రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రత్యామ్నాయ మార్గాలివే