TSRTC: తెలంగాణలో నేటి నుంచి అందుబాటులోకి ‘టి-9’ టికెట్‌.. రూ. 100 చెల్లిస్తే చాలు ఎంచక్కా..

|

Jun 18, 2023 | 12:18 PM

సంస్థలను లాభాల బాట పట్టించడమే లక్ష్యంగా తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయాలతో దూసుకుపోతోంది. ముఖ్యంగా సజ్జనార్‌ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్నారు. సిటీ బస్సులు మొదలు, జిల్లాల వరకు బస్సుల్లో రకరకాల ఆఫర్లను అందిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా...

TSRTC: తెలంగాణలో నేటి నుంచి అందుబాటులోకి టి-9 టికెట్‌.. రూ. 100 చెల్లిస్తే చాలు ఎంచక్కా..
TSRTC
Follow us on

సంస్థలను లాభాల బాట పట్టించడమే లక్ష్యంగా తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయాలతో దూసుకుపోతోంది. ముఖ్యంగా సజ్జనార్‌ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్నారు. సిటీ బస్సులు మొదలు, జిల్లాల వరకు బస్సుల్లో రకరకాల ఆఫర్లను అందిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ‘టి-9’పేరుతో ప్రత్యేక టికెట్‌ను ప్రవేశపెట్టారు. ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ టికెట్‌ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఇంతకీ ఈ టికెట్‌తో కలిగే ప్రయోజనాలు ఏంటి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలను తెలుపుతూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ట్వీట్ చేశారు.

ఆర్టీసీ బస్సులో కండక్టర్‌ ఇచ్చిన టీ9 టికెట్‌కు సంబంధించిన ఫొటోను షేర్‌ చేసిన సజ్జనర్‌.. ‘పల్లె వెలుగు బస్సుల్లో అధికంగా ప్రయాణించే మహిళలు, వృద్దుల కోసం తెలంగాణ ఆర్టీసీ కొత్తగా ‘టి-9 టికెట్‌’ను ప్రవేశపెట్టింది. ఈ రోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ టికెట్‌ అందుబాటులోకి వచ్చింది. రూ.100 చెల్లిస్తే 60 కిలోమీటర్ల పరిధిలో రానుపోనూ ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ టికెట్ వర్తిస్తుంది. టి-9 టికెట్ తో ఒక్కొక్కరికి రూ.20 నుంచి రూ.40 వరకు ఆదా అవుతుంది. మహిళలు, వృద్ధుల ఆర్ధిక భారం తగ్గించేందుకు తీసుకువచ్చిన ఈ టికెట్‌ను ఆదరించాలని సంస్థ కోరుతోంది’ అని ట్వీట్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..