TSPSC Paper Leak: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ కేసులో కీలక పరిణామం.. పిటిషన్‌ను 24కు వాయిదా వేసిన హైకోర్టు

|

Apr 11, 2023 | 9:49 PM

కేసుని సీబీఐకి అప్పగించి విచారిస్తేనే నిజానిజాలు బయటకి వస్తాయన్నారు లాయర్‌. మరోవైపు ప్రభుత్వం తరుపున అడ్వకేట్‌ జనరల్‌ వాదనలు వినిపించారు. ఇప్పటి వరకు 18 మంది నిందితుల్లో 17మందిని అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని, మరో నిందితుడు న్యూజిలాండ్ లో ఉన్నాడని..

TSPSC Paper Leak: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ కేసులో కీలక పరిణామం.. పిటిషన్‌ను 24కు వాయిదా వేసిన హైకోర్టు
TSPSC
Follow us on

TSPSC పేపర్ లీక్స్‌ పై రాజకీయ ప్రకంపనలు ఓ కుదుపు కుదిపేస్తోంటే… మరోవైపు కేసును సీబీఐకి అప్పగించాలంటూ NSUI ప్రెసిడెంట్ బలమూరి వెంకట్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది. TSPSC పేపర్ లీక్ దర్యాప్తు ఇంకా కొనసాగుతుండగానే నిందితులు ఇద్దరు మాత్రమేనని ఐటీ మినిస్టర్ ఎలా చెపుతారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వివేక్‌ ప్రశ్నించారు. కేసుని సీబీఐకి అప్పగించి విచారిస్తేనే నిజానిజాలు బయటకి వస్తాయన్నారు లాయర్‌. మరోవైపు ప్రభుత్వం తరుపున అడ్వకేట్‌ జనరల్‌ వాదనలు వినిపించారు. ఇప్పటి వరకు 18 మంది నిందితుల్లో 17మందిని అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని, మరో నిందితుడు న్యూజిలాండ్ లో ఉన్నాడని త్వరలో విచారిస్తామన్నారు ఏజీ. నిందితులను చట్ట ప్రకారం అరెస్ట్ చేసి జైలుకి పంపామని కోర్టుకి తెలిపారు. TSPSC పేపర్‌లీక్‌ కేసు విచారణ ఈనెల 24కి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. మరోవైపు సిట్‌ అధికారులు సబ్‌మిట్‌ చేసిన TSPSC దర్యాప్తు రిపోర్ట్‌ టీవీ 9 చేతికి చిక్కింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ పై హైకోర్టుకు సమర్పించిన స్టేటస్ రిపోర్టులో పలు కీలక నిమిషాలు ప్రస్తావించింది సిట్.18 పేజీల సిట్ ఇన్విస్టిగేషన్ సమ్మరీ రిపోర్ట్‌లో పేపర్ లీకేజీలో 40 లక్షల నగదు బదిలీ జరిగినట్టు పేర్కొంది. 250 పేజీల రిపోర్ట్స్, ఎన్‌క్లోజర్స్ ని కోర్టులో దాఖలు చేసింది. పేపర్ చేజిక్కించుకున్న 15 మందిని అరెస్ట్ చేసినట్టు సిట్‌ పేర్కొంది. శంకర్ లక్ష్మిని సాక్షిగా పరిగణిస్తూ సిట్ రిపోర్టునిచ్చింది. టీఎస్పీఎస్సీ లీకేజీలో ప్రధాన పాత్ర ప్రవీణ్, రాజశేఖర్ లదేనని సిట్‌ తేల్చి చెప్పింది. టీఎస్పీఎస్సీ మెంబర్, ఛైర్మెన్ ని విచారించినట్టు పేర్కొంది.

అంతేకాదు సిట్ దర్యాప్తు పై నమ్మకం లేదనీ, సీబీఐ, సిట్టింగ్ జడ్జ్ తో దర్యాప్తు చేయించాలన్న పిటిషన్లపై రిపోర్ట్ లో సిట్‌ వివరణనిచ్చింది. గతంలో సిట్ ఎన్నో సెన్సేషనల్ కేసుల్ని విచారించిందని, టీఎస్పీఎస్సీలో కూడా పటిష్టవంతంగా దర్యాప్తు చేస్తున్నామని సిట్ పేర్కొంది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు అవసరంలేదని సిట్ అభిప్రాయపడింది. టీఎస్పీఎస్సీ లో కీలకంగా మారిన FSL ఫైనల్ రిపోర్ట్ ఇంకా రావాల్సి ఉందని, దర్యాప్తులో భాగంగా వివాదస్పద కామెంట్స్ చేసిన రాజకీయ నాయకులకి నోటీసులిచ్చిన విషయాన్ని సిట్‌ ప్రస్తావించింది. అయితే పొలిటికల్ లీడర్స్ ఎలాంటి కీలక సమాచారాన్ని ఇవ్వలేదని సిట్‌ వెల్లడించింది. సాక్షులు, నిందితులు, మెంబర్ చైర్మెన్ ఇచ్చిన స్టేట్మెంట్స్, ఆధారాల్ని కోర్టుకి సమర్పించింది సిట్. సెక్షన్‌ 48,49కింద తమకు విచారించే అర్హత ఉందని అభిప్రాయపడింది ఈడీ. ఈడీ కస్టడీ పిటిషన్‌పై రేపు నాంపల్లి కోర్టు ఆదేశాలివ్వనుంది. నిందితుల కస్టడీ పిటిషన్‌లో కీలక అంశాలు ప్రస్తావించారు. మార్చి 23న సీసీఎస్‌ ఏసీపీకి లేఖ రాసిన ఈడీ…TSPSC కేసుకు సంబంధించిన..8 అంశాల డాక్యుమెంట్స్‌ ఇవ్వాలని కోరింది. TSPSC లీక్‌లో మనీ లాండరింగ్‌ జరిగినట్టు అభియోగం మోపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం  క్లిక్ చేయండి..