తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్వశ్చన్ పేపర్ లీక్స్ ఎఫెక్ట్.. మిగతా ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై పడింది. ఇప్పటికే కొన్ని పరీక్షలను వాయిదా వేసిన టీఎస్‌పీఎస్‌సీ.. తాజాగా మరికొన్ని పరీక్షలను వాయిదా వేసింది. ఐదీ పరీక్షలను రీషెడ్యూల్ చేసింది టీఎస్‌పీఎస్‌సీ. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఏప్రిల్ 23న జరగాల్సిన ఏఎంవీఐ పరీక్షను జూన్ 28కి వాయిదా వేసింది. ఈ నెల 25న జరగాల్సిన అగ్రికల్చర్ ఆఫీసర్ ఎగ్జామ్ మే 16కి వాయిదా పడింది. గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్ గెజిటెడ్ పోస్టుల పరీక్షలు జూలై 18, 19 కి వాయిదా పడ్డాయి. అయితే, ఈ పరీక్షలు ఏప్రిల్ 26, 27 తేదీల్లో జరగాల్సి ఉంది. ఇక మే 15, 16 తేదీల్లో జరగాల్సి ఉన్న గ్రౌండ్ వాటర్‌లో నాన్ గెజిటెడ్ పోస్టుల పరీక్షలు జులై 20, 21వ తేదీలకు వాయిదా పడ్డాయి. మే 7వ తేదీన జరగాల్సిన డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పరీక్ష మే 19కి వాయిదా పడింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను అభ్యర్థులు టీఎస్‌పీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌లో చూడొచ్చు. అభ్యర్థులు కొత్త తేదీలను తెలుసుకోవాలని టీఎస్‌పీఎస్‌సీ బోర్డు సూచించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..