KTR: నానమ్మకు ప్రేమతో.. రూ. రెండున్నర కోట్ల సొంత ఖర్చుతో పాఠశాల నిర్మించిన కేటీఆర్‌

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు అంద‌రిని ఆక‌ర్షిస్తుంది...త‌న నాన్నమ్మ సోంత ఊరు పై ప్రేమ‌ను చాటుకోవడం ఇప్పుడు కామారెడ్డి జిల్లా కోన‌పూర్‌లో పండ‌గ వాతవరణాన్ని సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. మంత్రి కేటిఆర్ నాన్నమ్మ వెంక‌ట‌మ్మ సోంతూరు బీబీపేట మండ‌లం కోన‌పూర్. కాగా గ‌త ఏడాది...

KTR: నానమ్మకు ప్రేమతో.. రూ. రెండున్నర కోట్ల సొంత ఖర్చుతో పాఠశాల నిర్మించిన కేటీఆర్‌
Minister Ktr

Edited By: Narender Vaitla

Updated on: Jul 10, 2023 | 11:16 AM

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు అంద‌రిని ఆక‌ర్షిస్తుంది…త‌న నాన్నమ్మ సోంత ఊరు పై ప్రేమ‌ను చాటుకోవడం ఇప్పుడు కామారెడ్డి జిల్లా కోన‌పూర్‌లో పండ‌గ వాతవరణాన్ని సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. మంత్రి కేటిఆర్ నాన్నమ్మ వెంక‌ట‌మ్మ సోంతూరు బీబీపేట మండ‌లం కోన‌పూర్. కాగా గ‌త ఏడాది మే 10 వ తేదీన కామారెడ్డి జిల్లా కోన‌పూర్‌లో ప‌ర్యటించారు మంత్రి. ఆ స‌మ‌యంలోనే త‌న సోంత డ‌బ్బులతో పాఠ‌శాల భవనానికి శంకుస్థాప‌న చేశారు.

అప్పటి నుంచి రెగ్యూల‌ర్‌గా మానిట‌ర్ చేస్తూనే ఉన్నారు. రూ. రెండున్నర కోట్లతో ఆధునిక హంగుల ఈ పాఠ‌శాల భ‌వనం నిర్మించారు. దీంతో పాటుగా గ్రామంలో రూ. 10 కోట్లతో ప‌లు అభివృద్ది ప‌నులను సైతం ప్రారంభించారు. గ్రామానికి వెళ్లే దారిలో రూ.2.50 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశారు..75 లక్షలతో సీసీ రోడ్లు వేశారు. అలాగే 25 ల‌క్షలతో గ్రామ పంచాయితీ నిర్మాణం చేప‌ట్టారు. మ‌రో 5 కోట్లను ప్రత్యేక నిధి కింద గ్రామానికి మంజారు చేశారు.. వీటితో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించారు. ఇళ్ల వరకూ రోడ్లు వేశారు. గ్రామంలో కుల సంఘాల భవనాలు, పలు ఆలయాల నిర్మాణాలు కూడా చేపట్టారు.

ఇవి కూడా చదవండి

పాఠశాల భవనానికి సంబంధించి ట్వీట్ చేసిన కేటీఆర్‌.. నిర్మాణం పూర్తయిన బిల్డింగ్ ఫొటో, వీడియోను కేటీఆర్ ట్వీట్టర్‌లో పోస్ట్ చేశారు. త్వర‌లోనే కోన‌పూర్‌కు వ‌చ్చి నిర్మాణాలను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. దీంతో గ్రామ‌స్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ భవనాల ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్‌.. తన తల్లి శోభతో కలిసి విచ్చేయనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..