‘మిషన్ భగీరథ’ తెచ్చిన గొప్ప విజయం.. ఫ్లోరైడ్ లేని తెలంగాణం

|

Sep 18, 2020 | 6:15 PM

'మిషన్ భగీరథ' తెచ్చిన గొప్ప విజయమిది. ఇంతకాలానికి ఫ్లోరైడ్ లేని తెలంగాణం సాక్షాత్కారమైంది. తెలంగాణ ఎదుర్కొన్న అతి ముఖ్యమైన సమస్యలలో ఒకటైన ఫ్లోరోసిస్ మీద తెలంగాణ రాష్ట్రం విజయం సాధించిందని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.

మిషన్ భగీరథ తెచ్చిన గొప్ప విజయం.. ఫ్లోరైడ్ లేని తెలంగాణం
Follow us on

‘మిషన్ భగీరథ’ తెచ్చిన గొప్ప విజయమిది. ఇంతకాలానికి ఫ్లోరైడ్ లేని తెలంగాణం సాక్షాత్కారమైంది. తెలంగాణ ఎదుర్కొన్న అతి ముఖ్యమైన సమస్యలలో ఒకటైన ఫ్లోరోసిస్ మీద తెలంగాణ రాష్ట్రం విజయం సాధించిందని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో ఫ్లోరైడ్ దాని ప్రభావిత ప్రాంతాలు లేనే లేవని ఆయన లెక్కలతో సహా వివరించారు. ఈ విషయాన్ని పార్లమెంట్‌లో సైతం ప్రస్తావించారని.. ‘మిషన్ భగీరథ’ పథకాన్ని విజయవంతంగా అమలు చేయడం వల్లే ఫ్లోరోసిస్‌పై విజయం సాధించగలిగామని కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ టీమ్‌ను మంత్రి కేటీఆర్ అభినందించారు. 2015 సమయంలో నేడు ఫ్లోరైడ్ బాధిత గ్రామాల వివరాల పట్టికను షేర్ చేశారు. అప్పట్లో తెలంగాణ వ్యాప్తంగా 967 గ్రామాలు ఫ్లోరైడ్, ఫ్లోరోసిస్ సమస్యను ఎదుర్కొన్నాయని..ప్రస్తుతం ఫ్లోరైడ్ బాధిత గ్రామాలు లేనేలేవని స్పష్టం చేశారు. ఏపీలో 2015 నాటికి 402 ఫ్లోరైడ్ బాధిత గ్రామాలుండగా.. ప్రస్తుతం 111 గ్రామాల్లో సమస్య ఉందని కేటీఆర్ ఈ సందర్భంలో ఉటంకించారు.