TRSPP Meet: రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడొద్దు.. టీఆర్ఎస్ ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్ధేశం!

|

Nov 28, 2021 | 5:38 PM

రేపటి నుంచి మొదలు కానున్న పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై హైదరాబాద్ ప్రగతి భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు

TRSPP Meet: రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడొద్దు.. టీఆర్ఎస్ ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్ధేశం!
TRS Leaders
Follow us on

CM KCR in TRSPP Meet: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఎంపీలు సమస్యలు గట్టిగా లేవనెత్తాలని టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ సూచించారు. రేపటి నుంచి మొదలు కానున్న పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై హైదరాబాద్ ప్రగతి భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ ఎంపీలో మాట్లాడుతూ.. రాష్ర్టానికి రావాల్సిన అన్ని రకాల ప్రయోజనాలపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. ముఖ్యంగా రైతాంగ సమస్యలపై కేంద్ర తీరును ఎండగట్టాలన్నారు. ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తాలని చెప్పారు. ఇప్పటికే చాలా ఓపిక పట్టము.. ధాన్యం కొనుగోలు విషయంలో ఉభయ సభల్లో కేంద్రాన్ని ప్రశ్నించాలన్నారు. కనీస మద్ధతు ధర చట్టం, విద్యుత్‌ చట్టాల రద్దు కోసం పోరాడాలన్నారు. కృష్ణా జలాల్లో రాష్ర్ట వాటాకోసం పట్టుబట్టాలని సూచించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు అన్నింటిపై పార్లమెంటల్‌లో తెలంగాణ వాణి వినింపించాలని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

కేంద్రం రాష్ట్రానికి ఎలాంటి సహకారం అందించడం లేదని గుర్తు చేసిన సీఎం.. విభజన చట్టంలోని హామీలను ఇంతవరకు నేరవేర్చ లేదని దానిపై కూడా పార్లమెంట్‌లో ప్రశ్నించాలని ఎంపీలకు సూచించారు. ఈ సారి ఎలాగైనా కేంద్రం విభజన చట్టంలోని హామీలను అమలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇలా కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన వివిధ అంశాలపై పార్లమెంట్‌లో ఎంపీలు పట్టుబట్టి సాధించుకురావాలని సీఎం కేసీఆర్‌ వారికి మార్గదర్శకం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడొద్దన్నారు. తెలంగాణలో రైతులకు ఉచిత విద్యుత్ అందించేందుకు వెనక్కి తగ్గేది లేదు.. యధావిధిగా ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

Read Also…. All-party Meeting: ప్రధాని లేకుండానే అఖిలపక్ష భేటీ.. ఎంఎస్‌పి, మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రస్తావించిన ప్రతిపక్షాలు!