Huzurabad – TRS: ఇప్పటిదాక ఒకెత్తు ఇక నుంచి ఒకెత్తు. హుజురాబాద్‌లో టీఅర్ఎస్ ప్రచార జోరు ఇక నుంచి ఇలాగే సాగనుంది. పండుగ బ్రేక్ తర్వాత భారీ ఎత్తున క్యాంపెయిన్‌కి సిద్దమవుతుంది గులాబీ దళం. చివరి రెండు వారాలు ప్రత్యర్థులకు ఊపిరి సలపకుండా చేసేందుకు ఎత్తులు వేస్తోంది. స్వయంగా తానే రంగంలోకి దిగనున్నారు సీఎం కేసీఅర్. హుజురాబాద్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టీఅర్ఎస్. దుబ్బాకలో ఓడిపోయినా లైట్ తీసుకున్న కేసీఆర్.. హుజురాబాద్ ను మాత్రం సీరియస్‌గా భావిస్తున్నారు. ఈటెలను ఇంటికి పంపాలని పెద్ద ఎత్తున అక్కడ మెహరించిన ఎమ్మెల్యేలకు, మంత్రులకు తోడు మరికొందరిని కూడా హుజురాబాద్ గ్రౌండ్‌లోకి పంపనుంది గులాబీ పార్టీ.
రేపు జరగబోయే టీఅర్ఎస్ శాసనసభ, శాసనమండలి, పార్లమెంట్ ప్రతినిధుల సమావేశంలో ఇంకొంత మందికి హుజురాబాద్ బాధ్యతలు అప్పగించనున్నారు పార్టీ అధినేత కేసీఆర్. ఇప్పటికే ప్రతి మండలానికి ముగ్గురు నుంచి అరుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అక్కడ పని చేస్తున్నారు. గ్రామగ్రామన పర్యటించి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మంత్రి హరీష్‌రావు పూర్తిస్థాయిలో హుజురాబాద్‌లోనే ఉంది అన్నితానై భాధ్యతలు తీసుకున్నారు. అయినా ఎందుకో అక్కడ టైట్ ఫైట్ నడుస్తుంది. ఈటెలకు లోకల్‌గా గట్టి పట్టు ఉండడం, ఆరు సార్లు గెలిచిన నేతగా ప్రజలతో వ్యక్తిగత పరిచయాలు ఉండడం, బీజేపీ కూడా ఈ ఎన్నికని సీరియస్‌గా తీసుకోవడంతో అక్కడ టగ్ అఫ్ వార్ నడుస్తుంది.
మెదట్లో టీఅర్ఎస్ కొంత బలహీనంగా ఉన్నా.. ముఖ్యమంత్రి కేసీఅర్ స్వయంగా దృష్టి పెట్టి దళిత భందు పథకాన్ని అక్కడ అమలు చేయడం, అక్కడే సభ నిర్వహించి ప్రారంభించడంతో పార్టీ గ్రాఫ్ బాగా పెరిగింది. ఇక రెండు వారాలు పూర్తిస్థాయిలో ఇంచార్జి ఎమ్మెల్యేలతో పాటు, మంత్రులు, ఎంపిలు కూడా హుజురాబాద్‌లో పర్యటించనున్నారు. ప్రతిమండలంలో రోజు రెండు ముడు సమావేశాలు ఉండేలా ప్లాన్ చేస్తుంది టీఅర్ఎస్. ప్రతి గ్రామన్ని ఈ రెండు వారాల్లో నాలుగుసార్లు టచ్ చేయడంతో పాటు, కుల సంఘాలు, మహిళా గ్రూపులతో మరోసారి సమావేశం కానున్నారు.
ఇక, మున్సిపాలిటీల్లో ప్రతిరోజు మంత్రులతో రోడ్ షొలు నిర్వహించనుంది. వీటన్నింటితో పాటు కేసీఅర్ బహిరంగసభ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. హుజురాబాద్ నియెజకవర్గంలో ఎన్నికల కోడ్ నేపధ్యంలో అనుమతి ఇవ్వకపోతే.. హుస్నాబాద్ లో భారీ బహిరంగసభకు ప్లాన్ చేస్తుంది గులాబి పార్టీ. మెత్తంగా సోమవారం నుంచి హుజురాబాద్ సమరానికి సన్నద్దం అవుతుంది అధికారపార్టీ.
రాకేష్, టీవీ9 ప్రతినిధి, హైదరాబాద్
Read also: Mohan Babu: పదేపదే రెచ్చగొట్టకండి.. అందరం కలిసి పనిచేద్దామన్నమోహన్ బాబు