Rohit Reddy: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. రోహిత్‌ రెడ్డికి అదనపు భద్రత..

|

Oct 29, 2022 | 11:48 AM

మొయినాబాద్‌ ఫాంహౌస్‌ ఎపిసోడ్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసి సంచలనం సృష్టించిన తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డికి భద్రత పెంచారు. పైలట్‌ రోహిత్‌ రెడ్డికి తెలంగాణ ప్రభుత్వం భద్రత మరింత పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

Rohit Reddy: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. రోహిత్‌ రెడ్డికి అదనపు భద్రత..
MLA Rohit Reddy
Follow us on

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం.. తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ అయితే.. మొయినాబాద్‌ ఫాంహౌస్‌ ఎపిసోడ్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసి సంచలనం సృష్టించిన తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డికి భద్రత పెంచారు. పైలట్‌ రోహిత్‌ రెడ్డికి తెలంగాణ ప్రభుత్వం భద్రత మరింత పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 4 + 4 గన్‌మన్లు కేటాయిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు బుల్లెట్ ప్రూఫ్‌ కారు కూడా మంజూరు చేసింది. అయితే.. పోలీసుల రహస్య ఆపరేషన్‌లో రోహిత్‌ రెడ్డి కీలకంగా ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. పోలీసులు రోహిత్‌ రెడ్డి ఇంటి వద్ద భారీ పికెట్‌ను ఏర్పాటు చేశారు.

ఇదిలా ఉంటే, నాలుగు రోజులుగా ప్రగతి భవన్‌లో నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. మొయినాబాద్‌ ఘటనకు సంబంధించి.. నిన్న రెండు ఆడియో క్లిప్‌లు విడుదల చేశారు పోలీసులు. ఇవాళ మరిన్ని ఆధారాలు విడుదల చేసే అవకాశం ఉంది. రేపు మునుగోడులో సీఎం కేసీఆర్ పెట్టబోయే బహిరంగ సభలో ఈ వ్యవహారంపై మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది.

మొయినాబాద్‌లో పోలీసులు నిర్వహించిన రహస్య ఆపరేషన్‌ సంచలనంగా మారింది. నిందితులు తమను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ రోహిత్‌ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. ముందస్తుగానే రంగంలోకి దిగిన పోలీసులు స్టింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించి.. పలు కీలక ఆధారాలను సేకరించారు. సుమారు మూడు గంటలపాటు సాగిన సమావేశాన్ని చిత్రీకరించారు.

ఇవి కూడా చదవండి

పోలీసులకు ఎదురుదెబ్బ..

పోలీసులు న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్‌ నివేదికలో ఈ ఆపరేషన్‌ సాగిన తీరును సవివరంగా వివరించారు. నిందితులను రిమాండ్‌ ఇవ్వాలని కోరారు. కాగా.. పోలీసుల అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. పోలీసులు వేసిన రిమాండ్‌ పిటిషన్‌ను తిరస్కరించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..