టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రాజయ్య తనదైనశైలిలో సరికొత్త శపథం చేశారు. తన నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సభ్యత్వ నమోదు సంఖ్య 60 వేలు పూర్తయ్యేంత వరకు గడ్డం తీయనని ప్రతినబూనారు. ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం తెలంగాణ వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ డివిజన్ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, జఫర్‌ఘడ్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే రాజయ్య సభ్యత్వ నమోదును ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ, దేశంలో ఒక ప్రాంతీయ పార్టీ 60 లక్షల సభ్యత్వాలను చేసి రికార్డు సృష్టిస్తే, ఆ రికార్డును మళ్లీ తామే బద్దలు కొట్టేందుకు 80 లక్షల సభ్యత్వాలను లక్ష్యంగా పెట్టుకున్నామని రాజయ్య అన్నారు. ఈ నెల 12 వ తేదీ నుండి నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు 60 వేలు పూర్తయ్యేంత వరకు గడ్డం తీయనన్నారు. తానెప్పుడు గడ్డం పెంచుకోలేదని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.