TRS Foundation Day: ఏప్రిల్ 27న టీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం.. హెచ్ఐసీసీ సభకు భారీగా ఏర్పాట్లు

|

Apr 16, 2022 | 9:21 PM

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఏప్రిల్ 27 వ తేదీన మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో నిర్వహించాలని పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.

TRS Foundation Day: ఏప్రిల్ 27న టీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం.. హెచ్ఐసీసీ సభకు భారీగా ఏర్పాట్లు
Trs Foundation Day
Follow us on

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఏప్రిల్ 27 వ తేదీన మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో నిర్వహించాలని పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. 27న ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు హెచ్ఐసీసీకి చేరుకోవాల‌ని పార్టీ ప్ర‌తినిధులంద‌రికీ సీఎం సూచించారు. ఈ స‌మావేశానికి టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలకు ఆహ్వానాలు పంపారు. మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సైతం హాజరు కానున్నారు. 27వ తేదీ ఉదయం 11.05 గంటలకు పార్టీ పతాకాన్ని అధినే కేసీఆర్‌ ఆవిష్కరించి సభా కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా సుమారు 11 తీర్మానాలను ఆమోదించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

ఉదయం 10 గంటలకల్లా ఆహ్వానితులంగా సభా ప్రాంగణానికి చేరుకోవాలని పార్టీ నేతలు సూచించారు. ఉదయం 10 గంటల నుంచి 11గంటల వరకు ప్రతినిధుల నమోదు కార్యక్రమం కొనసాగుతుంది. ఉదయం 11.05గంటలకు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ వేదిక వద్దకు చేరుకుంటారు. పార్టీ పతాకావిష్కరణ, స్వాగతోపన్యాసం అనంతరం కేసీఆర్ ప్రసంగం ఉంటుంది. తీర్మానాల ఆమోదం అనంతరం సాయంత్రం 5 గంటలకు కార్యక్రమం ముగుస్తుంది. ఈ సభకు రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, కార్పొరేషన్ల ఛైర్మన్లు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జిల్లా గ్రంథాలయాల సంస్థ, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు, మహిళా కో ఆర్డినేటర్లు, జడ్పీటిసీ సభ్యులు, మున్సిపల్ మేయర్లు, ఛైర్మన్లు, మండల పరిషత్ అధ్యక్షులు, పట్టణాలు, మండలాల పార్టీ అధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్లు పాల్గొననున్నట్లు పార్టీ వర్గాలు తెలిపారు.

కార్యక్రమ నిర్వహణ వివరాలు :

  1. ఏప్రిల్ 27 బుధవారం ఉదయం 10 గంటలకల్లా ప్రతినిధులందరూ హెచ్ఐసీసీ సమావేశ మందిరానికి చేరుకోవాలి.
  2. ఉచయం 10 గంటలనుంచి 11 గంటల వరకు ప్రతినిధుల నమోదు.
  3. ఉదయం 11:05 గంటలకు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ సభా ప్రాంగణానికి చేరుకుంటారు.
  4. ఉదయం 11:10 గంటలకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ పతాకావిష్కరణ.
  5. ఉదయం 11:15 గంటలకు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ స్వాగతోపన్యాసం
  6. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ సభను ఉద్దేశించి తొలిపలుకులు
  7. దాదాపు 11 తీర్మానాలు ప్రవేశపెట్టడం. అనంతరం వాటిపై చర్చించి ఆమోదించడం.

Read Also… Rahul Gandhi Tour: తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన ఖరారు.. మే 6న వరంగల్‌లో రైతు సంఘర్షణ సభకు హాజరు!