Triton EV: తెలంగాణ రాష్ట్రానికి మ‌రో భారీ పెట్టుబ‌డి.. రూ. 2100 కోట్లు, 25 వేల మందికి ఉద్యోగాలు..

|

Jun 24, 2021 | 8:27 PM

Triton EV: తెలంగాణ రాష్ట్రానికి మ‌రో భారీ పెట్టుబ‌డి రాబోతోంది. ఎల‌క్ట్రానిక్స్ వెహికిల్స్ త‌యారీ రంగంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా పేరుగాంచిన ట్రైటాన్-ఈవీ తెలంగాణలో భారీగా పెట్ట‌బ‌డులు పెట్ట‌నుంది. ఈ మేర‌కు గురువారం తెలంగాణ ప్ర‌భుత్వంతో అవ‌గాహ‌న...

Triton EV: తెలంగాణ రాష్ట్రానికి మ‌రో భారీ పెట్టుబ‌డి.. రూ. 2100 కోట్లు, 25 వేల మందికి ఉద్యోగాలు..
Triton Ev Mou With Govt
Follow us on

Triton EV: తెలంగాణ రాష్ట్రానికి మ‌రో భారీ పెట్టుబ‌డి రాబోతోంది. ఎల‌క్ట్రానిక్స్ వెహికిల్స్ త‌యారీ రంగంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా పేరుగాంచిన ట్రైటాన్-ఈవీ తెలంగాణలో భారీగా పెట్ట‌బ‌డులు పెట్ట‌నుంది. ఈ మేర‌కు గురువారం తెలంగాణ ప్ర‌భుత్వంతో అవ‌గాహ‌న ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఏకంగా రూ. 2100 కోట్ల పెట్టుబ‌డులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని సంస్థ ప్ర‌తినిధులు తెలిపారు. ఈ పెట్టుబడితో సుమారు 25 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంద‌ని తెలిపారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో నిర్వ‌హించిన స‌మావేశంలో ప‌రిశ్ర‌మ‌ల శాఖా మంత్రి కేటీఆర్‌తో స‌మావేశ‌మై త‌మ పెట్టుబ‌డి ప్ర‌ణాళిక‌ను వివ‌రించారు. భవిష్యత్తులో భారీగా డిమాండ్ ఉండే ఈవీ రంగంలో పెద్ద ఎత్తున విస్తరించేందుకు తమ కంపెనీ ఇప్పటికే ప్రణాళికలతో సిద్ధంగా ఉంద‌ని మంత్రి కేటీఆర్‌కు కంపెనీ సీఈఓ హిమాన్షు పటేల్ తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రల్లో అవ‌కాశాల‌ను ప‌రిశీలించిన తర్వాత‌.. తెలంగాణ కేంద్రంగా తమ కార్యకలాపాలను ముందుకు తీసుకుపోయేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ప్ర‌తినిధులు కేటీఆర్‌కు తెలిపారు. ఈమేర‌కు జహీరాబాద్ నిమ్జ్‌లో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు సుముఖంగా ఉన్నామని తెలిపింది.

కృత‌జ్ఞ‌తలు తెలిపిన మంత్రి కేటీఆర్‌..

తెలంగాణ లో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన ట్రైటాన్ (triton) ఎలక్ట్రిక్ వెహికల్ ప్రైవేట్ లిమిటెడ్‌కు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. కంపెనీ ప్రతిపాదిస్తున్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ద్వారా భారీ ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాలను తెలంగాణ‌లో ఉత్ప‌త్తి చేసే అవ‌కాశం ఉంద‌న్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన తెలంగాణ ఈవీ పాలసీ దేశంలోనే ఒక అత్యుత్తమ పాలసీ అని తెలిపిన మంత్రి.. టీఎస్ ఐపాస్ లో మెగా ప్రాజెక్ట్ కి లభించే అన్ని రకాల సహాయ సహకారాలను ప్రభుత్వం తరఫున అందిస్తామని కంపెనీ ప్ర‌తినిధుల‌కు తెలిపారు. ఈ స‌మావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, కంపెనీ సీనియర్ ప్రతినిధి బృందం పాల్గొంది.

Also Read: Telangana Corona Cases: తెలంగాణలో కొత్తగా 1,088 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఇలా..

Maoist Leaders: కారడవుల్లో కరోనా భయం.. తుపాకీ తూటాలను తప్పించుకున్నా… కరోనా రక్కసి మింగేస్తోంది..

University Of Hyderabad: హైదరాబాద్ యూనివర్సిటీ ఉద్యోగాల‌కు అప్లై చేసుకున్నారా.! రేపే చివరి తేదీ..