Munugode By Poll: మునుగోడు అభివృద్ధి కోసం బీజేపీలో చేరడం ఎందుకు? రేవంత్ రెడ్డి సూటి ప్రశ్న..

|

Aug 20, 2022 | 8:42 PM

Munugode By Poll: మునుగోడు అభివృద్ధి కోసమే ఉప ఎన్నికలు అయితే కాంగ్రెస్ నుంచి రాజగోపాల్ రెడ్డి పోటీ చేయొచ్చు కదా? అని టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి అన్నారు.

Munugode By Poll: మునుగోడు అభివృద్ధి కోసం బీజేపీలో చేరడం ఎందుకు? రేవంత్ రెడ్డి సూటి ప్రశ్న..
TPCC President Revanth Reddy
Follow us on

Munugode By Poll: మునుగోడు అభివృద్ధి కోసమే ఉప ఎన్నికలు అయితే కాంగ్రెస్ నుంచి రాజగోపాల్ రెడ్డి పోటీ చేయొచ్చు కదా? అని టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తానంటే బీఫామ్ ఇచ్చేందుకు పార్టీ సిద్ధంగా ఉందన్నారు. శనివారం నాడు మునుగోడు నియోజకవర్గంలో పర్యటించిన రేవంత్ రెడ్డి.. ఓటర్లనుద్దేశించి ప్రసంగించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఉప ఎన్నికయితే.. పార్టీ మారాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. మునుగోడులో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రచారం చేస్తారని ధీమాగా చెప్పారు పీసీసీ చీఫ్. వెంకట్‌రెడ్డితో కలిసే ప్రచారంలో పాల్గొంటామన్నారు. కాంగ్రెస్‌ తన ఒక్కడి సొత్తు కాదనీ.. ఎంతో మంది సీనియర్లు ఉన్నారన్నారు. తాను చేసిన రెడ్డి కామెంట్లలో ఎలాంటి వివాదం లేదన్నారు. పార్టీ మారే వాళ్లు విమర్శలు చేయడం మామూలే అన్నారు రేవంత్ రెడ్డి.

ఇదే సమయంలో టీఆర్‌ఎస్, బీజేపీపై విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి. టీఆర్‌ఎస్ ఎలా వ్యవహరిస్తోందో బీజేపీ కూడా అలాగే చేస్తోందని దుయ్యబట్టారు రేవంత్ రెడ్డి. నియోజకవర్గాల అభివృద్ధి కోసం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలే ఎందుకు రాజీనామా చేయాలని ప్రశ్నించారు. బీజేపీకి తెలంగాణలో నలుగురు ఎంపీలున్నారని, వారంతా రాజీనామా చేస్తే ఆ నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాలకు నిధులు వస్తాయి కదా అని అన్నారు. ఇతర పార్టీల ఎంపీటీసీలు, జెడ్పీటీసీ లను బీజేపీలో చేర్చుకోవాల్సిన అవసరమేంటని ఈటల రాజేందర్‌ను నిలదీశారు. పార్టీలో చేర్చుకున్న వారందరితోనూ రాజీనామా చేయించాలని రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..