Road Accident in Kamareddy District: తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం జిల్లాలోని ఎల్లంపల్లి మండలం హసన్ పల్లి గేట్ దగ్గర జరిగింది. గేటు దగ్గర వేగంగా వస్తున్న లారీ.. ట్రాలీ ఆటోను ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే ముగ్గురు మరణించారు. మరో 21 మందికి గాయాలయ్యాయి. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతులు, క్షతగాత్రులు పిట్లం మండలం చిలార్గి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మార్గ మధ్యంలో మరో ఇద్దరు మరణించారు.
స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బంధువు దశదిన కర్మలకు హాజరై తిరిగి ఇంటికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. మొత్తం ఏడుగురు పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో ట్రాలీ ఆటోలో మొత్తం 22 మంది ఉన్నారు.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: