Watch Video: బుల్లెట్ పాటకు వేయి మంది డ్యాన్స్.. రికార్డు సృష్టించిన జగిత్యాల విద్యార్థులు

|

Feb 27, 2022 | 8:25 AM

Bullet Bandi song: నీ బుల్లెట్‌ బండెక్కి వచ్చేత్త పా.. సాంగ్‌ జనాన్ని ఎంత ఊపేసిందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ పాటకి ఒకరు డ్యాన్స్‌ చేస్తేనే.. సోషల్‌ మీడియా అంతలా షేక్‌ అయింది.

Watch Video: బుల్లెట్ పాటకు వేయి మంది డ్యాన్స్.. రికార్డు సృష్టించిన జగిత్యాల విద్యార్థులు
Bullet Bandi Song
Follow us on

Bullet Bandi song: నీ బుల్లెట్‌ బండెక్కి వచ్చేత్త పా.. సాంగ్‌ జనాన్ని ఎంత ఊపేసిందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ పాటకి ఒకరు డ్యాన్స్‌ చేస్తేనే.. సోషల్‌ మీడియా అంతలా షేక్‌ అయింది. అలాంటిది వెయ్యి మంది ఒకేసారి డ్యాన్స్‌ చేస్తే..? ఇంకా క్రేజ్ మామూలుగా ఉండదు. ఈ క్రేజీ సాంగ్‌ బుల్లెట్‌ బండి సాంగ్‌కి ఒకేసారి వెయ్యి మంది డ్యాన్స్‌ చేశారు. అమ్మాయిలంతా కలిసి స్టెప్పులు వేసి కొత్త రికార్డు సృష్టించారు. ఈ సాంగ్‌కి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన స్టయిల్స్‌ ఒక ఎత్తు. వెయ్యి మంది డ్యాన్స్‌ చేయడం మరో ఎత్తుగా నిలిచింది. అందరూ ఉత్సాహంగా డ్యాన్స్‌ (Dance) చేసి కొత్త ట్రెండ్‌ సెట్‌ చేశారు. ఈ సరికొత్త రికార్డుకు జగిత్యాల (Jagtial) వేదికగా నిలిచింది. ఇంటర్నెషనల్‌ వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ కోసం వెయ్యి మందితో బుల్లెట్‌ బండి సాంగ్‌కి డ్యాన్స్‌ చేయించారు నిర్వాహకులు. మహిళలు, అమ్మాయిలు, చిన్నారులు నీ.. బుల్లెట్టు బండెక్కి వచ్చెత్త పా.. అంటూ స్టెప్‌లు వేస్తూ మైమరిపించేలా చేశారు.

మరి ఇంత మంది డ్యాన్స్‌ చేస్తే రికార్డుల మోత మోగకుండా ఎలా ఉంటుంది. దీన్ని ఆర్గనైజ్‌ చేసిన వారికి ఇంటర్నెషనల్‌ వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌లో చోటు కల్పించారు. ఈ అవార్డును ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, సుంకే రవిశంకర్, ఎమ్మెల్సీ ఎల్‌.రమణ అందించారు. ఈ సందర్భంగా డ్యాన్స్ వేసిన వారందరినీ.. వారంతా అభినందించారు. దీంతోపాటు నిర్వాహకులను సైతం ప్రశంసించారు.

Also Read:

Weekly Horoscope: వారఫలాలు.. వీరికి ఈ వారంలో అద్భుతమైన ఫలితాలు.. ఏ రాశి వారికి ఎలా ఉందంటే..

Russia Ukraine Crisis: క్షేమంగా బయటపడ్డ భారతీయ విద్యార్థులు.. ఢిల్లీ చేరిన రెండో విమానం!