‘‘మేడంటే మేడాకాదు గూడంటే గూడూ కాదు పదిలంగా అల్లూకున్న పొదరిల్లూ మాది’’ అంటూ మురిసిపోతున్నారు ఖమ్మం జిల్లాకు చెందిన ఓ జంట. ఓవైపు ప్రపంచమంతా కాంక్రీట్ జంగిల్‌గా మారిపోతుంటే వీరు మాత్రం ప్రకృతి ఒడిలో పదిలంగా వెదురు తడికలతో అందమైన ఇల్లు నిర్మించుకున్నారు. ఖమ్మం బైపాస్ రోడ్డులోని గణేష్ నగర్ 14వ లేన్‌లో వీరయ్య నిర్మించిన ఇల్లు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆ ఇంట్లోని ఫర్నీచర్ సైతం సహజత్వం ఉట్టిపడే వెదురు బొంగులతో తయారుచేసినవే. ఇంటి గోడలు, సీలింగ్ మొత్తం వెదురు తడకలే. ఇంటి నిర్మాణానికి అవసరమైన ఈ తడకలను అస్సాం నుంచి ప్రత్యేకంగా తెప్పించాలరు వీరయ్య. చుట్టూ కాంక్రీట్ భవనాల మధ్య ఈ వెదురు పొదరిల్లు ఎంతో ఆహ్లాదాన్నిస్తుంది.
అంతేకాదు, వెదురు బొంగులతో నిర్మించిన ఈ ఇల్లు దాదాపు ముప్పయేళ్లపాటు చెక్కు చెదరదు. ఈ ఇల్లు సహజత్వం ఉట్టిపడటమే కాకుండా రెండు డిగ్రీల వరకు చల్లగా ఉంటుంది. కాంక్రీట్ భవనానికి ఏమాత్రం తీసిపోని విధంగా అన్ని సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. ఈ వెదురులో సిలికా ఉంటుంది. వర్షాలు, అగ్నిప్రమాదాలను తట్టుకునేలా వెదురుకు ప్రత్యేకంగా కెమికల్స్ పూస్తారు. ఈ ఇంటి నిర్మాణం కోసం వీరయ్య ఆరు లక్షల రూపాయలు ఖర్చయిందంటున్నారు వీరయ్య. అంతేకాదు, వీరయ్య ఇంటి పెరటిలో సహజమైన పద్ధతిలో కూరగాయలు సాగుచేస్తున్నారు.
వీరయ్య తమ ఇంటికి అవసరమై కూరగాయలను తన పెరట్లోనే పండించుకుంటున్నారు. పెరటినిండా కుండీలలో ఆకు కూరలు, కూరగాయల మొక్కలతో పచ్చదనం ఉట్టిపడుతూ ఉంటుంది. పర్యావరణానికి ఎంతో మేలు చేసే ఈ పొదరిల్లు నిర్మించుకోవడం తమకు ఎంతో ఆనందంగా ఉందంటున్నారు వీరయ్య దంపతులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం