
తెలంగాణలో కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ముగ్గురు కొత్తవారికి కేబినెట్‌లో అవకాశం కల్పించేందుకు ఆమోదం లభించింది. కాగా ఈ ముగ్గురు ఎవరన్న విషయంపై తాజాగా క్లారిటీ వచ్చింది. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌కు మంత్రిగా అవకాశం లభించింది. అలానే.. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిలకు కూడా కేబినెట్‌లో బెర్త్ ఖరారైంది. మాల, మాదిగ, ముదిరాజ్ సామాజికవర్గాల నుంచి ఒక్కోక్కరికి అవకాశం కల్పించారు. ఆదివారం ముగ్గురు నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.