Pawan Kalyan: పవన్‌ కళ్యాణ్‌ తెలంగాణ పర్యటనపై మొదలైన కసరత్తు.. అక్కడి నుంచే యాత్ర ప్రారంభం..

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ తెలంగాణలో పర్యటించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో సమావేశమై ఏపీ రాజకీయాల్లో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచిన జనసేనాని, ఇప్పుడు తన దృష్టిని తెలంగాణవైపు మళ్లించారు...

Pawan Kalyan: పవన్‌ కళ్యాణ్‌ తెలంగాణ పర్యటనపై మొదలైన కసరత్తు.. అక్కడి నుంచే యాత్ర ప్రారంభం..
Janasena party chief pawan kalyan

Updated on: Oct 20, 2022 | 10:23 PM

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ తెలంగాణలో పర్యటించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో సమావేశమై ఏపీ రాజకీయాల్లో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచిన జనసేనాని, ఇప్పుడు తన దృష్టిని తెలంగాణవైపు మళ్లించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో జనసే పార్టీ పోటీ చేయనున్నట్లు పవన్‌ కళ్యాణ్‌ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా జనసేన పార్టీ తెలంగాణ విభాగం గురువారం ఈ విషయమై చర్చించింది.

తెలంగాణలోని కొండగట్టు నుంచి ప్రారంభం కానున్న యాత్ర, పార్టీ కార్యాచరణ అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పోటీ చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన నేపథ్యంలో ఈ యాత్రకు ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఈ యాత్రకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని పార్టీ నాయకులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ సమావేశంలో జనసేన తెలంగాణ ఇంచార్జి శ్రీ శంకర్ గౌడ్, పార్టీ నాయకులు శ్రీ రామ్ తాళ్లూరి, శ్రీ రాధారం రాజలింగంతో పాటు తదితరులు పాల్గొననున్నారు.

ఇదిలా ఉంటే జనసేన రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేయనుందన్న అంశం రాజకీయాల సర్కిల్స్‌లో ఆసక్తికరంగా మారింది. 2019 ఎన్నికల్లో జనసేన కేవలం ఏపీకి మాత్రమే పరిమితమైన విషయం తెలిసిందే. అయితే ఈసారి తెలంగాణలోనూ జనసేన బరిలోకి దిగుతుందని పవన్‌ క్యాడర్‌కు దిశా నిర్ధాశం చేశారు. అయితే తెలంగాణలో జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయా.? లేదా అన్న అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..