ప్రజాభవన్‌కు చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు.. స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి..

| Edited By: Ravi Kiran

Jul 06, 2024 | 6:08 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ ఉత్కంఠ రేపుతోంది. ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగి పదేళ్లయినా, విభజన చట్టంలోని చాలా సమస్యలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో, వీటి పరిష్కారం కోసం ఇరు రాష్ట్రాల సీఎంలు చొరవ తీసుకుని ఓ అడుగు ముందుకేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ ఉత్కంఠ రేపుతోంది. ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగి పదేళ్లయినా, విభజన చట్టంలోని చాలా సమస్యలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో, వీటి పరిష్కారం కోసం ఇరు రాష్ట్రాల సీఎంలు చొరవ తీసుకుని ఓ అడుగు ముందుకేశారు. దీంతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగే చర్చపై ఆసక్తి నెలకొంది. విభజన సమస్యల పరిష్కారానికి ఎలాంటి రోడ్‌ మ్యాప్‌ ఖరారవుతుందో వేచి చూడాలి.

ప్రజాభవన్‌లో జరిగే ముఖ్యమంత్రుల సమావేశానికి తెలంగాణ తరపున డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మరో ఇద్దరు అధికారులు హాజరు అవుతున్నారు. అటు ఏపీ నుంచి మంత్రులు అనగాని సత్యప్రసాద్‌, కందుల దుర్గేష్‌, బీసీ జనార్థన్‌ రెడ్డి తోపాటు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్, ఉన్నతాధికారులు రవిచంద్ర, కార్తికేయ మిశ్రా హాజరుఅవుతున్నారు.

భారీ భద్రత మధ్య కీలక భేటీ LIVE | High Security @ Praja Bhavan | CM Revanth - CM Chandrababu Meeting

 

Published on: Jul 06, 2024 05:21 PM