CM KCR: ఉద్యోగుల స‌ర్దుబాటు తర్వాత ఉద్యోగ నియామ‌క నోటిఫికేష‌న్లు.. టీజీవో నేతలకు సీఎం కేసీఆర్ హామీ

|

Nov 11, 2021 | 8:43 PM

ప్రభుత్వ ఉద్యోగు ముఖ్యమంత్రి శుభవార్త అందించారు. త్వర‌లోనే ఉద్యోగ నియామ‌క నోటిఫికేష‌న్లు విడుదల చేయనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు తెలిపారు.

CM KCR: ఉద్యోగుల స‌ర్దుబాటు తర్వాత ఉద్యోగ నియామ‌క నోటిఫికేష‌న్లు.. టీజీవో నేతలకు సీఎం కేసీఆర్ హామీ
Tgo Union Leader Meets Cm Kcr
Follow us on

CM KCR Meets TGO Leaders: ప్రభుత్వ ఉద్యోగు ముఖ్యమంత్రి శుభవార్త అందించారు. త్వర‌లోనే ఉద్యోగ నియామ‌క నోటిఫికేష‌న్లు విడుదల చేయనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల‌కు పెండింగ్‌లో ఉన్న డీఏ విడుద‌ల‌కు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించార‌ు. వెంట‌నే విడుద‌ల చేస్తామ‌ని హామీ ఇచ్చిన‌ట్లు టీజీవో నేతలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఉద్యోగుల త‌ర‌పున ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రగతి భవన్‌లో కలుసుకుని ప్రత్యేక కృత‌జ్ఞత‌లు తెలియ‌జేశారు.

తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం చైర్మన్, వ్యవ‌స్థాప‌క అధ్యక్షులు, మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ను ప్రగ‌తి భ‌వ‌న్‌లో టీజీవో అధ్యక్షులు మమత పాటు ఇత‌ర ఉద్యోగులు క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ప‌లు అంశాల‌పై సీఎంతో చ‌ర్చించారు.

జోన‌ల్ వ్యవస్థలో ఉద్యోగుల స‌ర్దుబాటు ప్రక్రియ పూర్తయిన త‌ర్వాత ఏర్పడే ఖాళీల‌కు, త్వర‌లోనే ఉద్యోగ నియామ‌క నోటిఫికేష‌న్లు విడుద‌ల చేస్తామ‌ని సీఎం చెప్పిన‌ట్లు టీజీవోలు పేర్కొన్నారు. ఉద్యోగుల స‌ర్దుబాటు ప్రక్రియ‌ను వీలైనంత త్వర‌గా పూర్తి చేసేందుకు స‌హ‌క‌రించాల‌ని సీఎం కోరిన‌ట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ కృషి వ‌ల్లనే నిరుద్యోగుల‌కు 95 శాతం ఉద్యోగాలు ద‌క్కనున్నాయి అని టీజీవోలు స్పష్టం చేశారు.

Read Also… Punjab Assembly: పంజాబ్‌ అసెంబ్లీలో రణరంగం.. కాంగ్రెస్‌-అకాలీదళ్‌ మధ్య తోపులాట.. 14మంది ఎమ్మెల్యేలపై వేటు!