కామారెడ్డి జిల్లా బిచ్‌కుందలో ఉద్రిక్తత.. రోడ్డు ప్రమాదం.. ఆగ్రహంతో పోలీసులపై దాడి చేసిన స్థానికులు..

|

Dec 28, 2020 | 9:38 PM

కామారెడ్డి జిల్లా బిచ్‌కుందలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇసుక లారీ ఢీకొని ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహానికి..

కామారెడ్డి జిల్లా బిచ్‌కుందలో ఉద్రిక్తత.. రోడ్డు ప్రమాదం.. ఆగ్రహంతో పోలీసులపై దాడి చేసిన స్థానికులు..
Follow us on

Road Accident: కామారెడ్డి జిల్లా బిచ్‌కుందలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇసుక లారీ ఢీకొని ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహానికి గురైన స్థానికులు ప్రమాదానికి కారణమైన లారీకి నిప్పు పెట్టారు. ఆ ఘటనలో లారీ పూర్తిగా దగ్ధం అయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి.. స్థానికులను అడ్డగించారు. వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ తగ్గకపోగా.. పోలీసులపైనే దాడి చేశారు. రోడ్డుపై వెళ్తున్న మరో నాలుగు లారీల అద్దాలను ధ్వంసం చేశారు. ఇదిలాఉండగా, ప్రమాదానికి గురైన వ్యక్తి గోపన్ పల్లి గ్రామానికి చెందిన విజయ్(28)గా గుర్తించారు. అతన్ని చికిత్స నిమిత్తం బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యా్ప్తు చేస్తున్నారు.

 

Also read:

వెరైటీ నిరసన, మీరొస్తే పూలమాలలు కావు, చెప్పులు, బూట్లతోనే స్వాగతం, బీజేపీ, మిత్ర పక్షాలకు ఓ గ్రామం వార్నింగ్

పోలీసులు – మావోయిస్టులకు ఎదురు కాల్పులు.. ఇద్దరు మహిళా మావోయిస్టులు హతం.. ఘటన స్థలంలో ఆయుధాలు స్వాధీనం