Telugu Desam Party: తెలంగాణలో టీడీపీ కథ ఖల్లాస్..! ఆరేళ్ళ కాలంలో క్రమంగా అంతర్ధానమైన సైకిల్

|

Apr 07, 2021 | 7:25 PM

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కథ ముగిసినట్లేనా? తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టీడీపీ తరపున గెలిచిన ఏ ఒక్కరు ఆ పార్టీలో లేరు. దాంతో తెలంగాణ అసెంబ్లీలో టీడీపీకి..

Telugu Desam Party: తెలంగాణలో టీడీపీ కథ ఖల్లాస్..! ఆరేళ్ళ కాలంలో క్రమంగా అంతర్ధానమైన సైకిల్
Follow us on

Telugu Desam Party story ends in Telangana: తెలంగాణ (TELANGANA)లో తెలుగుదేశం పార్టీ (TELUGU DESAM PARTY) కథ ముగిసినట్లేనా? తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం (TELANGANA STATE FORMATION) తర్వాత టీడీపీ (TDP) తరపున గెలిచిన ఏ ఒక్కరు ఆ పార్టీలో లేరు. దాంతో తెలంగాణ అసెంబ్లీ (TELANGANA ASSEMBLY)లో టీడీపీకి ప్రాతినిధ్యం నిల్ అయ్యింది. గత ఎన్నికల్లో తమ చిరకాల రాజకీయ ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ (CONGRESS PARTY)తో పొత్తు పెట్టుకుని అతి కష్టం మీద గెలిపించుకున్న ఇద్దరు శాసనసభ్యులు ఇపుడు గులాబీ గూటికి చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున ఇద్దరు విజయం సాధించగా.. వారిలో సండ్ర వెంకట వీరయ్య (SANDRA VENKATA VEERAIAH) చాలా కాలంగా అధికార టీఆర్ఎస్ పార్టీ (TRS PARTY)తో అంటకాగుతున్నారు. మిగిలిన మచ్చ నాగేశ్వర్ రావు (MACHHA NAGESHWAR RAO) కూడా బుధవారం (ఏప్రిల్ 7న) అకస్మాత్తుగా పార్టీ ఫిరాయించారు. సండ్ర, మచ్చా కలిసి బుధవారం తెలుగుదేశం పార్టీ లిజిస్లేటివ్ వింగ్‌ను టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులుకు లేఖ అందించారు. దాంతో తెలంగాణ అసెంబ్లీలో టీడీపీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది.

2014లో ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పటికీ.. ఫలితాలు వెలువడిన వెంటనే అంటే జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన కొందరు ఒక్కరొక్కరుగా అధికార టీఆర్ఎస్ పార్టీ వైపు అడుగులు వేశారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున తెలంగాణ అసెంబ్లీకి పదిహేను మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అయితే నాలుగేళ్ళ కాలంలో వారిలో ఒకరిద్దరు మినహా అంతా గులాబీ పార్టీలోకి జంప్ అయ్యారు. 2015లో తొలుత టీడీపీకి చెందిన ఎమ్మెల్సీలు సలీమ్, బాలసాని లక్ష్మీ నారాయణ, బోడకుంటి వెంకటేశ్వర్లు, గంగాధర్ గౌడ్‌లు శాసన మండలిలో టీడీపీ పక్షాన్ని  టిఆర్ఎస్‌లో విలీనం చేశారు. 2016లో ఎర్రబెల్లి దయాకర్ రావు (ERRABELLI DAYAKAR RAO) నేతృత్వంలో 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ఎల్పీ (TRSLP)లో విలీనమయ్యారు.

దాంతో 2018 అసెంబ్లీ ఎన్నికల నాటికి టీడీపీ పరిస్థితి హీన స్థాయికి పడిపోయింది. ఈ పరిస్థితిని గుర్తించిన చంద్రబాబు (CHANDRABABU NAIDU) తాను చిరకాలం వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు సిద్దమయ్యారు. దశాబ్ధాల పాటు పరస్పరం పోరాడిన కాంగ్రెస్, టీడీపీ నేతలు 2018 ఎన్నికల్లో చట్టపట్టాలేసుకుని మరీ ప్రచారం నిర్వహించారు. అయితేనేం పెద్దగా ఫలితం లేకపోయింది. టీడీపీ కేవలం రెండంటే రెండు సీట్లలో విజయం సాధించింది. గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలలో ఖమ్మం జిల్లా (KHAMMAM DISTRICT) సత్తుపల్లి (SATTUPALLY) నుంచి విజయం సాధించిన సండ్ర వెంకట వీరయ్య చాలా కాలంగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీతో సన్నిహితంగా వుంటూ తన పనులేవో చక్కబెట్టుకుంటున్నారు.

Tdlp Trs

మిగిలిన మచ్చా నాగేశ్వర్ రావు.. అశ్వారావుపేట (ASHWARAO PET) నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తూ తెలుగుదేశం పార్టీకి విధేయుడుగా వుంటున్నట్లు కనిపించారు. కానీ కొన్ని నెలలుగా తన నియోజకవర్గం పనుల నిమిత్తం అధికార పార్టీ నేతలను కలుస్తుండడంతో ఆయనపై కూడా గులాబీ పార్టీ ఆకర్ష్ అస్త్రాన్ని సంధించింది. ఈ క్రమంలోనే మచ్చా నాగేశ్వర రావు కూడా టీఆర్ఎస్ పార్టీకి సన్నిహితమయ్యారు. బుధవారం ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అంతకు ముందే ఆయన ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (CHIEF MINISTER K CHANDRASHEKHAR RAO)తో భేటీ అయ్యారు. ఆ తర్వాత సండ్ర వెంకట వీరయ్యతో కలిసి అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి (ASSEMBLY SPEAKER POCHARAM SRINIVAS REDDY)కి లేఖ రాశారు. టీడీఎల్పీ (TDLP)ని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. స్పీకర్ (SPEAKER) అందుబాటులో లేకపోవడంతో సండ్ర, మచ్చ లిద్దరు అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులుకు విలీనం లేఖను అందజేశారు. అనంతరం శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (VEMULA PRASHANT REDDY)తో కూడా భేటీ అయ్యారు.

షర్మిల రాకనే కారణమా?

గత కొంత కాలంగా తెలంగాణ పాలిటిక్స్ (TELANGANA POLITICS)‌లో పలు ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (AP CHIEF MINISTER YS JAGANMOHAN REDDY) సోదరి షర్మిల (YS SHARMILA) తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టేందుకు సంసిద్దమవుతున్నారు. పార్టీ ఏర్పాటుపై ఆమె పలు తెలంగాణ జిల్లాల వైఎస్ఆర్ (YSR) అభిమానులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రాజకీయాశ్రయం లేని పలువురు ఆమెతో కలిసి పని చేసేందుకు రెడీ అవుతున్నారు. ఏప్రిల్ 9వ తేదీన తన పార్టీ పేరును, జెండాను ఆవిష్కరించేందుకు ఖమ్మం జిల్లా పాలేరు (PALAIR)లో భారీ బహిరంగ సభను ప్లాన్ చేశారు షర్మిల. కానీ కరోనా సెకెండ్ వేవ్ (CORONA SECOND WAVE) విరుచుకు పడడంతో బహిరంగ సభకు పోలీసులు అనుమతించలేదు. దాంతో చిన్నపాటి సమావేశంలోనే షర్మిల తన పార్టీ వివరాలను వెల్లడించేందుకు సిద్దమవుతున్నారు. అయితే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పాలేరు నుంచే పోటీ చేయనున్నట్లు షర్మిల ఇదివరకే ప్రకటన చేశారు.

తెలంగాణలో వున్నప్పటికీ ఖమ్మం జిల్లాలో ఉమ్మడి రాష్ట్ర భావన వుండే వ్యక్తులు పెద్ద సంఖ్యలో వుంటారు. వారికి అటు ఏపీతోను, ఇటు తెలంగాణతోను సంబంధాలున్నాయి. ఇలాంటి వారి అండతో పాలేరులో సునాయాసంగా విజయం సాధించవచ్చని షర్మిల భావిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు అంఛనా వేస్తున్నారు. ఇదివరకు రాష్ట్ర విభజన తర్వాత టీడీపీకి తెలంగాణలో ఎంతో కొంత బలం వుందంటే అది ఖమ్మం జిల్లాలోనే. అందుకే గులాబీ గాలిలోను అక్కడ 2018 ఎన్నికల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీ తరపున గెలిచారు. పొలిటికల్ పోలరైజేషన్ కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న గులాబీ దళపతి.. ఖమ్మం జిల్లాలో షర్మిల ఎంట్రీని అడ్డుకునే వ్యూహంతోనే టీడీపీని విలీనం చేయించుకున్నట్లు తెలుస్తోంది.

ALSO READ: బెంగాల్ బరిలో ఉద్ధండులు.. ఎవరెవరి సీట్లు ఏవంటే?

ALSO READ: చర్చలకు రెడీ అంటున్న మావోయిస్టులు.. ఘోర రక్తపాతం తర్వాత సాధ్యమేనా?