Telangana: రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు.. హైదరాబాద్‌కు ఎల్లో, జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ!

తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ (IMD) అత్యంత కీలకమైన హెచ్చరిక జారీ చేసింది. నేడు శుక్రవారం (జూన్ 26) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ 'ఆరెంజ్ అలర్ట్' ప్రకటించింది. వర్షంతో పాటు ఉరుములు, మెరుపులు సంభవిస్తాయని, గంటకు 40–50 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని వెల్లడించింది.

Telangana: రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు.. హైదరాబాద్‌కు ఎల్లో, జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ!
Telangana Weather Alert

Updated on: Jun 26, 2026 | 5:34 PM

తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ (IMD) అత్యంత కీలకమైన హెచ్చరిక జారీ చేసింది. నేడు శుక్రవారం (జూన్ 26) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ‘ఆరెంజ్ అలర్ట్’ ప్రకటించింది. వర్షంతో పాటు ఉరుములు, మెరుపులు సంభవిస్తాయని, గంటకు 40–50 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని వెల్లడించింది.

ఆరెంజ్ అలర్ట్ జిల్లాలు: మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఎల్లో అలర్ట్ జిల్లాలు: హైదరాబాద్‌తో పాటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, కరీంనగర్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్ధిపేట, యాదాద్రి, రంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

ఉత్తర తెలంగాణపై ఉపరితల ఆవర్తనం

ఉత్తర తెలంగాణ పరిసర ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. జూన్ 27 నుండి జూలై 2 వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కొనసాగుతాయి. రాబోయే 7 రోజుల పాటు తెలంగాణలోని అనేక చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని, చాలా ప్రాంతాల్లో 30–40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది.

ఇక రాజధాని హైదరాబాద్‌లో వచ్చే 24–48 గంటల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో నగరావాసులు ప్రయాణాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us