దేవాలయాల్లో శఠగోపం ఎందుకు పెడతారు? శఠారి వెనుక ఉన్న అసలు ఆధ్యాత్మిక రహస్యం ఇదే!
19 July 2026
Rajashekher
దైవ దర్శనం అనంతరం పూజారి భక్తుల తలపై ఉంచే రాగి లేదా వెండి వంటి లోహాలతో తయారైన పరికరాన్ని శఠగోపం (శఠారి) అంటారు. దీనిపై భగవంతుడి పాద ముద్రలు ఉంటాయి.
శఠగోపం అంటే ఏమిటి?
మనలోని అహంకారం (శఠం) తొలగించి, వినయాన్ని పెంపొందించే సంకేతంగా దీనికి శఠగోపం అనే పేరు వచ్చిందని ఆధ్యాత్మిక వేత్తలు వివరిస్తున్నారు.
శఠగోపం అనే పేరుకు అర్థం
పూజారి స్వామివారి సేవలో ఉండి, దైవాన్ని స్పృశించే భాగ్యం పొందినవాడు. అందుకే దైవ అనుగ్రహానికి ప్రతీకగా భక్తుల తలపై శఠగోపం ఉంచుతారు.
పూజారి ఎందుకు శఠగోపం పెడతారు?
ఆధ్యాత్మికవేత్తల వివరణ ప్రకారం, గర్భంలో శిశువుకు హాని కలిగించే శఠవాయువు నుంచి రక్షించేదనే భావనతో దీనిని శఠగోపం అని పిలుస్తారు.
శఠవాయువు నుంచి రక్షణకు ప్రతీక
శఠగోపం పెట్టడం ద్వారా "స్వామివారి కృపతో మళ్లీ జన్మ ఎత్తాల్సిన అవసరం లేకుండా మోక్షం సిద్ధించాలని" ఆశీర్వదించే భావం ఇందులో నిక్షిప్తమై ఉందని చెబుతారు.
మోక్షానికి సంకేతం
శఠగోపంపై స్వామివారి పాద చిహ్నాలు ఉండటంతో, దానిని తలపై ఉంచుకోవడం అంటే దైవ పాదాలను శిరస్సుపై ధరించడం అనే ఆధ్యాత్మిక భావన.
దైవ పాదాలను శిరస్సుపై ధరించినట్లే
వైష్ణవ దేవాలయాల్లో "శఠగోపులు" అనే ప్రత్యేక పూజారులు ఈ సేవ నిర్వహిస్తారు. భక్తులు తలను వంచి శఠగోపం స్వీకరించడం వినయం, సమర్పణకు చిహ్నంగా భావిస్తారు.
వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక సంప్రదాయం
గర్భగుడిలో దైవసన్నిధి, మంత్రోచ్చారణల ప్రభావంతో శఠగోపం దివ్యశక్తిని గ్రహిస్తుందని విశ్వాసం. దానిని తలపై ఉంచినప్పుడు ఆ శక్తి సహస్రార చక్రం ద్వారా శరీరమంతా ప్రసరించి మనసుకు ప్రశాంతతను కలిగిస్తుందని ఆధ్యాత్మిక వేత్తలు వివరిస్తున్నారు.