నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!

తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాల అంశాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ పోరు ముదురుతోంది. గోదావరి జలాల నుంచి ఢిల్లీ నిధులు, ఉద్యోగాల భర్తీ వరకు పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. తెలంగాణ సెంటిమెంట్‌ను కేంద్రంగా చేసుకుని ఇరు పార్టీలు ప్రజల్లో పైచేయి సాధించేందుకు వ్యూహాలు అమలు చేస్తున్నాయి.

నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
Telangana Sentiment

Updated on: Aug 06, 2026 | 9:55 PM

తెలంగాణ సెంటిమెంట్‌కు మూలం.. ‘నీళ్లు’. కోటి ఎకరాలకు, లక్షలాది రైతులకు ప్రాణాధారమైన ఈ జలాలపైనే. ఇప్పుడు రాష్ట్రంలో మరోసారి పొలిటికల్ హీట్ పీక్స్‌కు చేరింది. గోదావరి, కృష్ణా నదీ జలాల సాక్షిగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య మరోసారి జలయుద్ధం మొదలైంది. తెలంగాణ నీటి ప్రయోజనాలను సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రాకు తాకట్టు పెట్టారంటూ మాజీ మంత్రి హరీష్‌రావు ఆరోపణలు గుప్పించారు. ఇంతకీ, గోదావరి బోర్డు మీటింగ్ అజెండాలో ఏముంది? తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై హరీష్‌రావు వాదన ఏంటి? దీనికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ ఇచ్చిన కౌంటర్ ఏంటి? తెలంగాణ నీటి హక్కులను ఆంధ్రాకు తాకట్టు పెట్టడానికి కారణం.. నీటిపారుదల శాఖలో ఉన్న ఆంధ్రా అధికారులు అంటూ సెంటిమెంట్ అస్త్రం సంధించారు హరీష్‌రావు. ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో కీలక స్థానాల్లో ఉన్నవారంతా ఆంధ్రా మూలాలు ఉన్న వారేనంటూ ఓ లిస్ట్ బయటకు తీశారు. వాళ్లంతా తెలంగాణకు అన్యాయం చేస్తుంటే తెలంగాణ హక్కులను కాపాడాల్సిన అధికారులు, ఇంజినీర్లు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. తెలంగాణలో తెలంగాణ కోసం పుట్టిన పార్టీలే అధికారంలో ఉండాలంటూ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. ఇందుకు, నీళ్ల అంశాన్నే ఉపయోగించుకున్నారు. తెలంగాణకు సంబంధించిన 7 ప్రాజెక్టులను రద్దు...

Loading...
Unable to load recommendations.
Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి