పేద ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్లపై సూపర్ అప్‌డేట్..

Indiramma Houses: పేదలకు సొంతింటి కలను దగ్గర చేస్తూ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరింత వేగవంతం చేస్తోంది. జూన్ 2న ఆదిలాబాద్‌లో రెండో విడత పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఇకపై లబ్ధిదారులు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు 5–8 కిలోమీటర్ల పరిధిలోనే ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

పేద ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్లపై సూపర్ అప్‌డేట్..
Indiramma House

Edited By:

Updated on: May 13, 2026 | 7:28 AM

హైదరాబాద్‌లో పేదల సొంతింటి కలను నిజం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని మరింత వేగవంతం చేస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మొదటి విడత ఇండ్ల నిర్మాణం పూర్తి దశకు చేరుకున్న నేపథ్యంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

దీనికి సంబంధించిన విధివిధానాలపై ఈ నెల 21న జరిగే మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. రెవెన్యూ, హౌసింగ్ అంశాలపై జిల్లాల వారీగా ప్రజాప్రతినిధులతో నిర్వహిస్తున్న సమీక్ష సమావేశాల్లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో మంత్రి కీలక సూచనలు చేశారు. గత ప్రభుత్వం హైదరాబాద్ నగరానికి చాలా దూరంగా 2BHK ఇండ్లు నిర్మించడం వల్ల లబ్ధిదారులు అక్కడ నివసించడానికి ఆసక్తి చూపడం లేదని అన్నారు. జీవనోపాధికి ఇబ్బందులు తలెత్తడంతో అనేక కాలనీలు ఖాళీగా మారినట్లు క్షేత్రస్థాయి పరిశీలనల్లో బయటపడిందని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ఇకపై పేదలు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు 5 నుంచి 8 కిలోమీటర్ల పరిధిలోనే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ప్రతి నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని ప్రభుత్వ భూములు, మురికివాడలు, భూదాన్ భూములు, పాత హౌసింగ్ కాలనీల్లో శిథిలావస్థలో ఉన్న ఇళ్ల ప్రాంతాలను గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.

ప్రజాప్రతినిధులను కూడా ఈ ప్రక్రియలో భాగస్వాములను చేయాలని స్పష్టం చేశారు. ఇప్పటికే నిర్మాణం పూర్తైన 2BHK ఇండ్లకు లబ్ధిదారులను కేటాయించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. ఈ నెలాఖరు కల్లా పూర్తి అయిన ఇండ్లు, వివిధ దశల్లో ఉన్న ఇండ్లకు లబ్ధిదారులను గుర్తించాలని తెలిపారు. అయితే ఆయా కాలనీలకు 5 నుంచి 8 కిలోమీటర్ల పరిధిలో నివసించే వారికే ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. అలాగే కాలనీల్లో మంచినీరు, డ్రైనేజీ, విద్యుత్ వంటి కనీస సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

Also Read: బలం వర్సెస్ విషం.. పైథాన్ Vs కింగ్ కోబ్రా పోరు.. గెలుపు ఎవరిది..?

Follow Us