AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: రౌడీ షీటర్ నందనవనం సూరి హత్య కేసులో సంచలన ట్విస్ట్.. ఇన్‌స్టాగ్రామ్ లైవ్ వీడియో వైరల్!

హైదరాబాద్‌లోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ నందనవనం సూరి అలియాస్ దాసరి సురేందర్ హత్య కలకలం రేపింది. గతంలో పలు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్న సూరిని గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్య అనంతరం ప్రధాన నిందితుడిగా భావిస్తున్న వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోకి వచ్చి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Hyderabad: రౌడీ షీటర్ నందనవనం సూరి హత్య కేసులో సంచలన ట్విస్ట్.. ఇన్‌స్టాగ్రామ్ లైవ్ వీడియో వైరల్!
Nandanavanam Suri Murder Case
Balaraju Goud
|

Updated on: Jul 21, 2026 | 4:22 PM

Share

హైదరాబాద్‌లోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ నందనవనం సూరి అలియాస్ దాసరి సురేందర్ హత్య కలకలం రేపింది. గతంలో పలు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్న సూరిని గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్య అనంతరం ప్రధాన నిందితుడిగా భావిస్తున్న వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోకి వచ్చి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, నందనవనం సూరి తన రెండో భార్య తమ్ముడు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు మీర్‌పేట్‌లోని నందనవనం ప్రాంతానికి వెళ్లాడు. సూరి అక్కడికి వచ్చిన విషయం తెలుసుకున్న ఆఫ్రూజ్‌ (సల్మాన్ సోదరుడు) అక్కడికి చేరుకుని ముందుగా అతని కళ్లలో పేపర్ స్ప్రే చల్లినట్లు తెలుస్తోంది. అనంతరం కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడంతో సూరి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

సూరిపై గతంలో తన భార్య, బామ్మర్ది సల్మాన్ హత్య కేసులతో పాటు వరంగల్, హైదరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్‌ల పరిధిలో పలు క్రిమినల్ కేసులు నమోదైనట్లు సమాచారం. అతనిపై నగర బహిష్కరణ కూడా అమల్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇక ఈ హత్య అనంతరం ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న ఆఫ్రూజ్ ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోకి వచ్చి సూరిని తానే హత్య చేశానని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే పోలీసులను ఉద్దేశించి దుర్భాషలాడినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో కనిపించింది. అయితే వైరల్ వీడియో ప్రామాణికతపై పోలీసులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

హత్య కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను సేకరిస్తున్నారు. వైరల్ వీడియోతో పాటు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. ఘటనకు గల పూర్తి కారణాలు, హత్య వెనుక ఉన్న పరిస్థితులు దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమవుతాయని పోలీసులు తెలిపారు.

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకుపుట్టాల్సిందే..!
ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకుపుట్టాల్సిందే..!
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. అంతలోనే కాల్పులతో..
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. అంతలోనే కాల్పులతో..
గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు..
గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు..
ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీకెమెరాలో కిల్లర్ తల్లి, కొడుకు !
ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీకెమెరాలో కిల్లర్ తల్లి, కొడుకు !
వందే భారత్ ఢీ కొని యువతి మృతి! మౌలాలి వద్ద విషాద ఘటన
వందే భారత్ ఢీ కొని యువతి మృతి! మౌలాలి వద్ద విషాద ఘటన
బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే
బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే
ఇరుముడి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది.. లిరికల్ వీడియో
ఇరుముడి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది.. లిరికల్ వీడియో
31 ఏళ్ల రికార్డులు బద్దలు.. కమిన్స్ పేరిట చెత్త రికార్డ్..!
31 ఏళ్ల రికార్డులు బద్దలు.. కమిన్స్ పేరిట చెత్త రికార్డ్..!
ఇదెక్కడి బాల్ రా సామీ.. ఆసీస్ బ్యాటర్ మైండ్ బ్లాంక్
ఇదెక్కడి బాల్ రా సామీ.. ఆసీస్ బ్యాటర్ మైండ్ బ్లాంక్
రాత్రిపూట పుదీనా టీ తాగి పడుకుంటే ఏమవుతుందో తెలుసా? ఆరోగ్య లాభాలు
రాత్రిపూట పుదీనా టీ తాగి పడుకుంటే ఏమవుతుందో తెలుసా? ఆరోగ్య లాభాలు