Telangana Formation Day: దశాబ్ది ఉత్సవాల సంబురం.. తెలంగాణ వ్యాప్తంగా పోటాపోటీగా వేడుకలు..

|

Jun 02, 2024 | 8:54 AM

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటికి పదేళ్లు పూర్తయింది.. దీంతో తెలంగాణ అంతటా దశాబ్ది ఉత్సవాల సందడి నెలకొంది. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ పెద్దఎత్తున వేడుకలను నిర్వహిస్తోంది. ఉదయం 9:30కి సీఎం రేవంత్ రెడ్డి గన్‌పార్క్‌ దగ్గర నివాళులర్పించనున్నారు. ఉదయం 10గంటల నుంచి సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగే ఉత్సవాల్లో పాల్గొంటారు.

Telangana Formation Day: దశాబ్ది ఉత్సవాల సంబురం.. తెలంగాణ వ్యాప్తంగా పోటాపోటీగా వేడుకలు..
Telangana Formation Day
Follow us on

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటికి పదేళ్లు పూర్తయింది.. దీంతో తెలంగాణ అంతటా దశాబ్ది ఉత్సవాల సందడి నెలకొంది. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ పెద్దఎత్తున వేడుకలను నిర్వహిస్తోంది. ఉదయం 9:30కి సీఎం రేవంత్ రెడ్డి గన్‌పార్క్‌ దగ్గర నివాళులర్పించనున్నారు. ఉదయం 10గంటల నుంచి సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగే ఉత్సవాల్లో పాల్గొంటారు. అంతేకాకుండా.. ఇవాళ రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్‌ రెడ్డి.. పోలీస్‌ సిబ్బందికి అవార్డులు ప్రదానం చేయనున్నారు. రాత్రి 7గంటల నుంచి ట్యాంక్‌బండ్‌పై అవతరణ ఉత్సవాలు జరగనున్నాయి. వేడుకల్లో భాగంగా కార్నివాల్‌, షాపింగ్‌, గేమ్‌షోలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం సీఎం రేవంత్‌ 6:30కి ట్యాంక్‌బండ్‌కు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా జయ జయహే తెలంగాణ పాటతో ఫ్లాగ్‌ వాక్‌ నిర్వహించనున్నారు. సాయంత్రం జరిగే వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి అందెశ్రీ, కీరవాణిని సన్మానించనున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను బీఆర్‌ఎస్‌ పార్టీ ఘనంగా ప్రారంభించింది. మూడు రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి. హైదరాబాద్‌ గన్‌పార్క్‌ దగ్గర BRS అధినేత అధినేత.. గులాబీ దళపతి కేసీఆర్‌ క్యాండిల్‌ ర్యాలీని ప్రారంభించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం అసువులు బాసిన అమరవీరులకు నివాళి అర్పిస్తూ గన్‌పార్క్‌ నుంచి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయం ఎదురుగా ఉన్న అమరజ్యోతి వరకు క్యాండిల్‌ ర్యాలీ కొనసాగింది. ఇవాళ ఉదయం 9గంటలకు కేసీఆర్ జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. కాగా.. తెలంగాణ ప్రభుత్వ అధికారిక వేడుకలకు బీఆర్ఎస్ హాజరుకావడం లేదు. సీఎం రేవంత్‌ తీరును నిరసిస్తూ బహిరంగ లేఖ రాసిన కేసీఆర్‌.. తెలంగాణ అస్తిత్వాన్ని కాంగ్రెస్‌ అవమానిస్తోందంటూ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో మూడ్రోజులపాటు దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా.. తెలంగాణ ఉద్యమ ప్రస్థానం, పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనపై ఛాయాచిత్ర ప్రదర్శన నిర్వహించనున్నారు.

బీజేపీ ఆధ్వర్యంలో కూడా తెలంగాణ అవతరణ వేడుకలు జరగనున్నాయి. ఉదయం 9గంటలకు బీజేపీ ఆఫీస్‌లో తెలంగాణ వేడుకలు ప్రారంభంకానున్నాయి. టీబీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..