CM KCR: ఈనెల 11న తెలంగాణ మంత్రివర్గ సమావేశం.. ఆ అంశమే ప్రధాన ఎజెండా..

|

Aug 09, 2022 | 8:52 PM

Telangana Cabinet Meeting: సీఎం కేసీఆర్ అధ్యక్షత రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఈ స‌మావేశానికి మంత్రులు హాజ‌రు కానున్నారు.

CM KCR: ఈనెల 11న తెలంగాణ మంత్రివర్గ సమావేశం.. ఆ అంశమే ప్రధాన ఎజెండా..
Cm Kcr
Follow us on

తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ స‌మావేశం ఈనెల 11న కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షత రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఈ స‌మావేశానికి మంత్రులు హాజ‌రు కానున్నారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఇందులో ముఖ్యంగా రాష్ట్రానికి అదనపు ఆర్థిక వనరులతోపాటు, పలు అభివృద్ధి కార్యక్రమాపై కైడా మంత్రివర్గం చర్చ జరపనుంది. ఎఫ్‌ఆర్‌ఎంబీకి లోబడి రాష్ట్ర ప్రభుత్వం బాండ్ల జారీ ద్వారా తీసుకునే రుణాల్లో కేంద్రం కోత విధించింది. 53 వేల కోట్లలో కేంద్రం 15 వేలు కోట్లు కోత విధించినట్లు ఇటీవల సీఎం కేసీఆర్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు ప్రాజెక్టులు సహా ఇతరాల కోసం వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకునే అప్పులు ఆగిపోయాయి. దీంతో ప్రత్యామ్నాయంగా అదనపు వనరుల సమీకరణపై మంత్రి వర్గ భేటీలో చర్చిస్తారు. అయితే ఈ అంశాలపై ఇప్పటికే ఆర్థిక మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం చర్చిస్తోంది.

నిరుపయోగంగా ఉన్న భూములు, రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల విక్రయం వంటి వాటిని ప్రభుత్వం ఇప్పటికే సమాలోచన చేసింది. వాటితోపాటు సంబంధిత పలు అంశాలపై మంత్రివర్గంలో ఓ నిర్ణయంతీసుకోనున్నారు. కొత్త పెన్షన్లు, డయాలసిస్ రోగులకు ఆసరా పింఛన్లు, అనాథపిల్లల సంక్షేమం కోసం చర్యలు, స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా 75 మంది ఖైదీల విడుదల సహా ఇతర అంశాలపై కేబినెట్ చర్చించనుంది. వీటితోపాటు పాలనాపరమైన అంశాలు, రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై కూడా చర్చించే అవకాశం ఉంది.

అయితే ఈ భేటీలో మునుగోడు ఉప ఎన్నికపై కూడా మంత్రివర్గం ప్రత్యేక దృష్టి పెట్టనుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా నేపథ్యంలో మునుగోడు ఉపఎన్నికల్లో పార్టీ వ్యూహం ఎలా ఉండాలి..? సంబంధిత అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..