Telangana SSC Exam 2021: తెలంగాణ ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు గుడ్‌న్యూస్ తెలిపింది. వార్షిక పరీక్షలలో ఆరు పేపర్లు మాత్రమే ఉంటాయని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పదో తరగతి విద్యార్థులకు గతంలో 1, పేపర్ 2గా మొత్తం 11 ప్రశ్న పత్రాలు ఉండేవి. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఆ పత్రాలను ఆరుకే పరిమితం చేసినట్లు వెల్లడించారు. ఫస్ట్ లాంగ్వేజ్, ఇంగ్లీష్, గణితం, జనరల్సైన్స్, సోషల్ స్టడీస్ ప్రశ్నపత్రాలను సింగిల్ పేపర్‌కే పరిమితం చేయగా, మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కాగా 80 మార్కులు బోర్డ్ ఎగ్జామ్, 20 ఇంటర్నల్మార్కులు ఉంటాయని తెలిపారు. అలాగే పదో తరగతి పరీక్షలకు సంబంధించిన పలు అంశాలపై ప్రధానోపాధ్యాయులకు డైరెక్టర్కృష్ణారావు పలు మార్గదర్శకాలను విడుదల చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో రెగ్యులర్ టెన్త్, ఓపెన్ టెన్త్, ఒకసారి ఫెయిలైన విద్యార్థుల ఆన్‌లైన్ డేటా సేకరణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు.
అయితే గతంలో కొన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గడువు తేదీలు ముగిసిన రెండు, మూడు నెలలకు మాన్యుస్క్రిప్ట్ నామినల్‌రోల్స్‌ను సమర్పిస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని, ఈసారి అలా ఆలస్యంగా జరకుండా చూసుకోవాలన్నారు. ఒకవేళ ఆలస్యం జరిగినట్లయితే ఆలస్య రుసుము చెల్లించుకోవాల్సి ఉంటుందని అన్నారు. జిల్లాలవారీగా విద్యాశాఖాధికారుల కార్యాలయంలో చలాన్‌తో పాటు ఎంఎన్ఆర్‌లను గడువులోగా అందించాలని, అలా అందించకుంటే తర్వాత తీసుకునే అవకాశం ఉండదని కృష్ణారావు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి: